Thailand Allows Rajapaksa: సింగపూర్ టూ థాయ్‌లాండ్.. దేశంలో తలదాచుకొనేందుకు రాజపక్సకు తాత్కాలిక అనుమతిచ్చిన థాయ్‌లాండ్.. కానీ ఒక్క షరతు ..

దేశంలో ప్రజలనుంచి పెల్లుబికిన ఆగ్రహావేశాలతో శ్రీలంక నుంచి పారిపోయిన ఆ దేశ మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్సను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. సుమారు నెల రోజుల నుంచి పలు దేశాలు మారుతూ ఆశ్రయం పొందుతున్నాడు. తాజాగా ఆయన తాత్కాలిక నివాసంకోసం థాయ్‌లాండ్ కు వస్తున్నట్లు ఆ దేశం ప్రకటించింది.

Thailand Allows Rajapaksa: సింగపూర్ టూ థాయ్‌లాండ్.. దేశంలో తలదాచుకొనేందుకు రాజపక్సకు తాత్కాలిక అనుమతిచ్చిన థాయ్‌లాండ్.. కానీ ఒక్క షరతు ..

Thailand Allows Rajapaksa

Thailand Allows Rajapaksa: దేశంలో ప్రజలనుంచి పెల్లుబికిన ఆగ్రహావేశాలతో శ్రీలంక నుంచి పారిపోయిన ఆ దేశ మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్సను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. సుమారు నెల రోజుల నుంచి పలు దేశాలు మారుతూ ఆశ్రయం పొందుతున్నాడు. తాజాగా ఆయన సింగపూర్ లో తలదాచుకున్నాడు. అయితే గురువారంతో ఆయన వీసా గడువు ముగియనుంది. ఆయన సింగపూర్ నుంచి థాయ్ లాండ్ రానున్నారు. ఈ విషయంపై థాయ్‌లాండ్ ప్రధాని ప్రయుత్ చాన్-ఓ-చా మాట్లాడుతూ.. దేశ బహిష్కరణకు గురైన శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్సను తాత్కాలికంగా దేశంలో ఉండేందుకు థాయ్‌లాండ్ అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. థాయ్‌లాండ్ లో దిగిన తర్వాత శాశ్వత ఆశ్రయం పొందేందుకు మరోదేశం కోసం వెతుకుతారని థాయ్‌లాండ్ ప్రధాని పేర్కొన్నారు.

Gotabaya Rajapaksa: గొటబయ రాజపక్స పారిపోలేదు.. శ్రీలంకకు తిరిగి వస్తున్నారట.. ఎప్పుడంటే?

రాజపక్సను దేశం లోపలికి అనుమతించడం తాత్కాలికంగానైనా మానవతావాద సమస్య అని థాయ్ ప్రధాని పేర్కొన్నారు. ఇది తాత్కాలిక బస మాత్రమేనని, అయితే రాజపక్స ఇక్కడ ఉన్నప్పుడు ఎటువంటి రాజకీయ కార్యకలాపాలకు అనుమతించబడవని అన్నారు. థాయ్ లాండ్ లో ఉంటూనే అతడు శాశ్వతంగా ఆశ్రయం పొందేందుకు వేరే దేశాలను వెతికేందుకు ఉపయోగపడుతుందని చాన్-ఓ-చా చెప్పినట్లు బ్యాంకాక్ పోస్ట్ వార్తాపత్రిక పేర్కొంది. రాజపక్స ఇప్పటికీ దౌత్యపరమైన పాస్‌పోర్ట్ హోల్డర్‌గా ఉన్నందున రాజపక్సే 90రోజుల పాటు థాయ్‌లాండ్‌లో ఉండవచ్చని థాయ్‌లాండ్ విదేశాంగ మంత్రి డాన్ ప్రముద్వినై చెప్పారని థాయ్ లాండ్ లోని మీడియా పేర్కొంది. అయితే రాజపక్స థాయ్‌లాండ్‌ పర్యటనకు అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘే నేతృత్వంలోని లంక ప్రభుత్వం అభ్యంతరం చెప్పలేదని థాయ్‌లాండ్ విదేశాంగ మంత్రి చెప్పారు. అయితే థాయ్‌లాండ్ ప్రభుత్వం రాజపక్సే ఉండేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేయదని, ఆయనే తన వసతి ఏర్పాట్లను స్వయంగా చూసుకోవాల్సి ఉంటుందని అన్నారు.

Gotabaya Rajapaksa :‘ఎక్కడికెళ్లినా తప్పని తిప్పలు’..సింగపూర్ లో గొటబాయపై 63 పేజీల ఫిర్యాదు..

శ్రీలంక అంతటా ప్రభుత్వ పై ప్రజలనుంచి వ్యతిరేఖత వ్యక్తమయింది. గత నెల 11, 12 తేదీల్లో నిరసనకారులు అధ్యక్ష భవనంలోకి ప్రవేశించడం, రాజపక్స గొటబయ రాజీనామాకు డిమాండ్ చేశారు. అధ్యక్ష భవన్ లోకి భారీగా నిరసనకారులు తరలిరావడంతో రాజపక్స శ్రీలంక నుంచి ఇతర దేశాలకు పారిపోయాడు. జూలై 13న మాల్దీవులలో అడుగుపెట్టాడు. ఆ తరువాత సింగపూర్‌కు వెళ్లిపోయాడు. అక్కడి నుంచే శ్రీలంక అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు గొటబయ ప్రకటించారు. అయితే సింగపూర్ లో అతని వీసా గడువు ముగియడంతో థాయ్ లాండ్ కు వెళ్లేందుకు రాజపక్స గొటబయ సిద్ధమయ్యారు. థాయ్ లాండ్ అతనికి 90 రోజులు తాత్కాలిక నివాసం ఉండేందుకు అనుమతి ఇచ్చింది. అయితే రాజపక్స థాయ్‌లాండ్ కు ఎప్పుడు వస్తారనేది తమకు సమాచారం లేదని ఆ దేశ విదేశాంగ వ్యవహారాల మంత్రి తెలిపారు.