Gotabaya Rajapaksa: గొటబయ రాజపక్స పారిపోలేదు.. శ్రీలంకకు తిరిగి వస్తున్నారట.. ఎప్పుడంటే?

శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్స తిరిగి శ్రీలంక వస్తున్నారట.. ప్రస్తుతం సింగపూర్ లో ఉన్న ఆయన అక్కడి నుండి నేరుగా దేశానికి వస్తారంట.. ఈ విషయాన్ని ఆ దేశ క్యాబినెట్ అధికార ప్రతినిధి బందుల గుణవర్ధన మంగళవారం మీడియాతో అన్నారు. అయితే ఆయన ఏ తేదీన వచ్చేది ఖచ్చితంగా చెప్పలేనని తెలిపారు.

Gotabaya Rajapaksa: గొటబయ రాజపక్స పారిపోలేదు.. శ్రీలంకకు తిరిగి వస్తున్నారట.. ఎప్పుడంటే?

Gotaboya

Gotabaya Rajapaksa: శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్స తిరిగి శ్రీలంక వస్తున్నారట.. ప్రస్తుతం సింగపూర్ లో ఉన్న ఆయన అక్కడి నుండి నేరుగా దేశానికి వస్తారంట.. ఈ విషయాన్ని ఆ దేశ క్యాబినెట్ అధికార ప్రతినిధి బందుల గుణవర్ధన మంగళవారం మీడియాతో అన్నారు. అయితే ఆయన ఏ తేదీన వచ్చేది ఖచ్చితంగా చెప్పలేనని అన్నారు. రాజపక్స అజ్ఞాతంలో లేడని, ప్రస్తుతం ఆయన సింగపూర్ లో ఉన్నారని, శ్రీలంక వస్తారని గుణవర్ధన చెప్పుకొచ్చారు. కొలంబో గెజిట్ ప్రకారం.. రాజపక్సే సరైన మార్గాల ద్వారానే సింగపూర్ కు వెళ్లారని, దొంగతనంగా వెళ్లలేదంటూ గొటబయాను వెనుకేసుకొస్తూ గుణవర్ధన వ్యాఖ్యలు చేశారు.

Sri Lanka: వారంలో ప‌రిస్థితులు చ‌క్క‌దిద్దాల‌ని శ్రీలంక కొత్త అధ్య‌క్షుడు విక్ర‌మ‌సింఘే నిర్ణ‌యం

శ్రీలంకలో ఆర్థిక, ఆహార సంక్షోభానికి కారణం అధ్యక్షుడు గొటబయ రాజపక్స అంటూ అక్కడి ప్రజలు ఆయన అధికారిక నివాసాన్ని ముట్టడించారు. దీంతో ఆయన అక్కడి నుంచి మాల్దీవులకు పరారయ్యాడు. రెండు రోజులు అక్కడే ఉన్న గొటబయ.. తిరిగి ప్రత్యేక విమానం ద్వారా సింగపూర్ కు వెళ్లిపోయాడు. సింగపూర్ వెళ్లిన వెంటనే అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన లేఖను విడుదల చేశారు. ప్రస్తుత అధ్యక్షునిగా రాణి విక్రమ్ సింఘే ఎన్నికయ్యారు.

Sri Lanka Crisis : శ్రీలంకలో దయనీయ పరిస్థితులు..పెట్రోల్‌ బంకుల వద్ద క్యూలైన్‌లోనే ప్రాణాలు కోల్పోతున్న జనం

గొటబయకు విదేశాలకు వెళ్లినా నిరసనలు తప్పడం లేదు. మాల్దీవుల్లో గొటబయ ఉన్న సమయంలో అక్కడి ప్రజలు కొందరు గొటబయ ను ఇక్కడ ఉండనివ్వద్దంటూ ప్లకార్డులతో నిరసన తెలిపారు. సింగపూర్ లోనూ ఆయనకు వ్యతిరేఖంగా నిరసనలు తప్పడం లేదు. దక్షిణాఫ్రికాకు చెందిన ఇంటర్నేషనల్ ట్రూత్ అండ్ జస్టిస్ ప్రాజెక్ట్ (ఐటీజేపీ) అనే పౌర హక్కుల సంఘం గొటబాయ పై సింగపూర్ అటార్నీ జనరల్ కు 63 పేజీలతోకూడిన భారీ ఫిర్యాదును చేసిన విషయం విధితమే.