Supreme Court: సమాజంలో మార్పు వస్తేనే వరకట్న సమస్య పోతుంది: సుప్రీంకోర్టు

వరకట్నం అనే దురాచారం పోవాలంటే సమాజంలో మార్పు రావాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

Dowry a social evil but change come within society : ఒకప్పుడు కన్యాశుల్కం.. ఇప్పుడు వరకట్నం..ఈ రెండింటి వల్ల బాధితులుగా ఉన్నది మాత్రం మహిళలే. టెక్నాలజీలో ఎంతగా అభివృద్ది చెందుతున్నా సమాజంలో ఇంకా ఎన్నో దురాచారాలు కొనసాగుతునే ఉన్నాయి. దాంట్లో వరకట్నం అనేది మహిళలకు పెను శాపంగా మారింది. ఇటువంటి వరకట్నంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ వరకట్నం సామాజిక సమస్య అని..సమాజంలో మార్పు వస్తేనే గానీ ఈ దురాచారం పోదు‘‘అను సామాజికంగా వచ్చే వల్లే ఈ వరకట్నం దురాచారం సమసిపోతుందని సోమవారం (డిసెంబర్ 6,2021)సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

Read more : Shocking news : వాంతులు చేసుకున్న షార్క్ చేప..వీడిన 90 ఏళ్లనాటి హత్య కేసు మిస్టరీ..

వరకట్నం వంటి విషయాల్లో కోర్టులకు పరిమితులు ఉంటాయని జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్, జస్టిస్‌ ఎ.ఎస్‌.బోపన్నలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. వరకట్నం అనేది ఓ దురాచారం అని దాంట్లో ఏమాత్రం సందేహం లేదు అని..ఓ మహిళను కట్నంతోనే ఎలా పరిగణిస్తారు? ఈ విషయంలో సమాజంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని పేర్కొంది. వరకట్నం సమస్య నిరోధానికి మూడు సూచనలు చేస్తూ కేరళకు చెందిన సబు సెబాస్టియన్‌ వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని పరిష్కరిస్తూ సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ విషయాన్ని లా కమిషన్‌ దృష్టికి తీసుకువెళ్తామని..తెలిపింది.

Read more : UP Election : ఎర్ర టోపీలు యూపీకి రెడ్ అలర్ట్..స‌మాజ్‌వాది పార్టీపై మోదీ ఫైర్

‘‘చట్టపరమైన సంస్కరణలు చాలా అవసరమే… కానీ మొదట సమాజంలో మార్పు రావాల్సిఉందని..మహిళలను ఏ విధంగా గౌరవించాలి, ఏ విధంగా వారిని కుటుంబంలోకి ఆహ్వానించాలి అన్నదానిపై చర్చలు జరగాలని ఈ మార్పులు రావాలంటే సమాజంలో మార్పు రావాలని అన్నారు. వరకట్నం అనే దురాచారం వివాహ వ్యవస్థపైనే ప్రభావం చూపుతోంది’’ అని వ్యాఖ్యానించింది.సమాచార హక్కు అధికారులు ఉన్నట్లుగానే వరకట్న నిరోధించటానికి కూడా ప్రత్యేక అధికారులు ఉండాలని..వివాహ సమయంలో మహిళకు ఇచ్చిన నగలు కనీసం ఏడేళ్లు వారి వద్దే ఉండేలా చూడాలని.. వివాహానికి ముందు కౌన్సెలింగ్‌ ఇవ్వాలని ఇటువంటి పలు అంశాలను పాఠ్యాంశాలు ఉండాలని పిటిషన్‌దారు కోరారు.

ట్రెండింగ్ వార్తలు