Shocking news : వాంతులు చేసుకున్న షార్క్ చేప..వీడిన 90 ఏళ్లనాటి హత్య కేసు మిస్టరీ..

ఓ టైగర్ షార్క్ చేప వాంతులు చేసుకోవటంతో దాదాపు 90 ఏళ్లుగా మిస్టరీగా ఉన్న ఓ హత్య కేసు మిస్టరీ వీడింది..!!

Shocking news : వాంతులు చేసుకున్న షార్క్ చేప..వీడిన 90 ఏళ్లనాటి హత్య కేసు మిస్టరీ..

Tiger Shark Vomited Human Arm (1)

Tiger Shark Vomited Human Arm  : తిమింగలం వాంతి చేసుకుంటే అది దొరికి కోటీశ్వరులయ్యారని విన్నాం. కానీ ఓ షార్క్ చేప వాంతి చేసుకోవటంతో ఎంతోకాలంగా ఓ హత్య కేసు మిస్టరీ వీడింది. చేప ఏంటీ మిస్టరీ కేసు చిక్కుముడి వీడటం ఏంటీ హత్యకు..చేపకు సంబంధం ఏంటీ అనే పలు ప్రశ్నలు బుర్రను తొలిచేస్తున్నాయి కదూ..మరి ఆ కథాకమామీషు ఏంటో తెలుసుకుందాం..అది ఆస్ట్రేలియాలో సిడ్నీలోని కూగీ అక్వేరియం. ఆ అక్వేరియంలో 13 అడుగుల పొడగున్న టైగర్  షార్క్ చేప ఉంది. ఈ చేపకు ఏమైందో ఏమోగానీ ఒకరోజు సడెన్ గా దానికి వాంతులు అయ్యాయి. అలా వాంతులు చేసుకుంటుంటే అక్వేరియంలో ఉన్నవారంతా షాక్‌ అయ్యారు. దీనికేమైంది ఇలా ఉంది అని అనుకున్నారు. అలా ఆ షార్క్‌ చేప వాంతులు చేసుకుంటుంటే దాని పొట్టలోంచి వాంతి ద్వారా ఒక ఎలుకను, ఓ పక్షి బయటకొచ్చాయి. మనం తిన్న ఆహారం జీర్ణం కాకకపోతే తిన్నదంతా ఎలా బయటకు వచ్చేస్తుందో అలా ఆ షార్క్ చేపకు కూడా తిన్న ఆహారం జీర్ణం కాలేదు.అలా వాంతి చేసుకోగా మొదటగా ఓ ఎలుక, ఓ పక్షి బయటకొచ్చాయి. ఆ తరువాతే జరిగింది అసలు విషయం..

Read more : Murder Mystery : వీడిన గోపి మర్డర్ మిస్టరీ.. కులాంతర ప్రేమే కారణం.. గొంతుకోసి హత్య

అలా వాంతి చేసుకున్న ఆ షార్క్ రెండో సారి వాంతి చేసుకోగా..దాని పొట్టలోంచి ఓ గోధుమ రంగు నురగతో కూడిన ఒక పొడవాటి పదార్ధం బయటకొచ్చింది.అది చూసినవారంతా మరోసారి షాక్ అయ్యారు. అదేంటాని దగ్గరకెళ్లి చూడగా అది ఓ మనిషి చేయి అని తెలిసి ఎక్కడివారక్కడ బిగుసుకుపోయారు. పైగా ఆ చేయి మీద ఓ పచ్చబొట్టు కూడా ఉంది. దీంతో ఆస్ట్రేలియాను పట్టి పీడిస్తున్న 1935 నాటి ఒక హత్య కేసు పోలీసులు చేదించారు పోలీసులు..ఆ షార్క్‌ చేప వాంతి చేకున్న చేయి జిమ్మీ స్మిత్‌ అనే మాదక ద్రవ్యాల స్మగ్లర్‌దిగా పోలీసులు గుర్తించారు. ఆ చేతిపై ఇద్దరూ బాక్సర్‌లు హోరాహోరీగా తలపడుతున్న పచ్చబొట్టు ఉంటుంది. సాధారణం చాలామంది పలు డిజైన్ల పచ్చబొట్లు వేయించుకుంటారు. కానీ ఇది చాలా అరుదైన డిజైన్. అంతేకాదు ఆ చేయి మణికట్టుకు ఒక తాడు ఉంటుంది. అయితే ఈ స్మిత్‌ మాజీ సైనికుడు ప్యాట్రిక్ బ్రాడీతో కలిసి తమ క్లైయింట్‌లను ఫోర్జరీ చేసిన నకిలీ చెక్‌లతో మోసం చేస్తుండేవారు.

Read more : Omicron Tension : శ్రీకాకుళం జిల్లాలో ఒమిక్రాన్ టెన్షన్..దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తికి కోవిడ్ పాజిటివ్

అ తర్వాత కొన్నాళ్లకి ఆ ఫోర్జరీ కేసు నుంచి ఇద్దరూ ఏదో విధంగా బయటపడ్డారు. ఈ మేరకు కొంతకాలం తర్వాత స్మిత్‌ బ్రాడిని బ్లాక్‌మెయిల్‌ చేయడం మొదలు పెట్టాడు. అయితే ఆ ఇద్దరూ చివరిసారిగా ఒక హోటల్‌ కలిసి మధ్యం తాగారు. వారి కదలికలను పోలీసులు గుర్తించారు.ఆ తర్వాత రోజే స్మిత్‌ హత్యకు గురవ్వడంతో పోలీసులు అనుమానంతో బ్రాడీని అదుపులోకి తీసుకున్నారు. విచారించారు. కానీ హత్య జరిగిందని తెలిసింది గాని మృతదేహం జాడ లేదు. ఈ కథలో అదే ట్విస్ట్‌. హత్యకు గురైన స్మిత్‌ మృతదేహ కనిపించకపోవడంతో పోలీసులు ఆ కేసును చేధించలేకపోయారు. మృతదేహం గురించి ఎంతో కాలం వెదికారు. కానీ ఫలితం లేదు.

Read more : Petrol bunks in space : అంతరిక్షంలో పెట్రోల్‌ బంకులు..

కూగీ అక్వేరియం యజమాని బ్రెట్ హాబ్సన్ షార్క్‌ చేప వాంతులు చేసుకున్న వీడియోలతో పాటు ఎలా వాంతులు చేసుకుందో వివరిస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయటంతో ఇన్ని దశాబ్దాలకు ఈ హత్యకేసు మిస్టరీ వీడింది. దీంతో పోలీసులు ఆ షార్క్‌ చేప వాంతి చేసుకున్న మానవ చేయి ఆధారంగా ఈ కేసును చేధించారు. అయితే విచారణలో షార్క్‌ చేప స్మిత్‌పై దాడి చేయలేదని..బహుశా మృతదేహాన్ని మాయం చేసే క్రమంలో జరిగిన పరిణామ క్రమంలో మృతుడి చేయి షార్క్ కడుపులోకి వెళ్లినట్లుగా పోలీసులు నిర్థారించారు. కానీ మృతదేహం ఆ షార్క్ చేప కడుపులోకి ఎలా వెళ్లిందో తెలియాల్సి ఉంది.ఈ హత్య కేసు 1935లో విచారణ ప్రారంభమైనప్పటి నుండి ఆస్ట్రేలియాను పట్టి పీడించని కేసుగా ఉంది ఈనాటికి ఈ హత్యకేసు ఎట్టకేలకు మిస్టరీ వీడింది.