Murder Mystery : వీడిన గోపి మర్డర్ మిస్టరీ.. కులాంతర ప్రేమే కారణం.. గొంతుకోసి హత్య

ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్న ఈ రోజుల్లోనూ ఇంకా కులాలు, మతాలను పట్టుకుని వేలాడుతున్నారు కొందరు వ్యక్తులు. కులం, మతం పేరుతో ఉన్మాదుల్లా వ్యవహరిస్తున్నారు. సాటి మనిషి ప్రాణం తీసి హంత

Murder Mystery : వీడిన గోపి మర్డర్ మిస్టరీ.. కులాంతర ప్రేమే కారణం.. గొంతుకోసి హత్య

Murder Mystery

Murder Mystery : ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్న ఈ రోజుల్లోనూ ఇంకా కులాలు, మతాలను పట్టుకుని వేలాడుతున్నారు కొందరు వ్యక్తులు. కులం, మతం పేరుతో ఉన్మాదుల్లా వ్యవహరిస్తున్నారు. సాటి మనిషి ప్రాణం తీసి హంతకులుగా మారుతున్నారు. తాజాగా గుంటూరు జిల్లా వట్టి చెరుకూరు మండలం పల్లపాడులో ఐదు రోజుల క్రితం జరిగిన బండారు గోపి (19) హత్య కేసును చేబ్రోలు పోలీసులు ఛేదించారు. ఈ హత్యకు కులాంతర ప్రేమే కారణమని పోలీసులు గుర్తించారు. గోపి హత్య కేసులో మొత్తం 11 మంది నిందితులను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.

Doctor Rape : దారుణం… బర్త్‌డే పార్టీకి పిలిచి మహిళా డాక్టర్‌పై అత్యాచారం

పల్లపాడు గ్రామానికి చెందిన గోపి అదే గ్రామంలోని ఓ యువతి రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ వ్యవహారం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు, బంధువులు గోపిని మందలించారు. అమ్మాయికి దూరంగా ఉండాలని వార్నింగ్ ఇచ్చారు. అయితే, ఎన్నిసార్లు హెచ్చరించినా గోపి లెక్క చేయలేదు. దీంతో వాళ్లు గోపి హత్యకు స్కెచ్ వేశారు. ఫ్రెండ్స్ సాయంతో గోపిని రప్పించారు. అక్కడి నుంచి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ కర్రలతో అతనిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఆ తర్వాత ఆటోలో అప్పాపురం కాలువ దగ్గరికి తీసుకెళ్లారు. అక్కడ కత్తితో గొంతుకోసి దారుణంగా హత్య చేశారు.

Do not praise your children : పిల్లల్ని పొగడొద్దు..మన పెద్దలు ఎప్పుడో చెప్పారు, ఇప్పుడు సైంటిస్టులు చెబుతున్నారు..ఎందుకంటే

”గోపిని చంపేయాలని యువతి తండ్రి భావించాడు. అవకాశం కోసం ఎదురుచూస్తున్న అతడు… గోపి మిత్రులకు డబ్బు ఆశ చూపి గోపిని తీసుకురావాలని చెప్పాడు. బావమరిది అప్పారావుతో కలిసి మర్డర్ స్కెచ్ వేశాడు. ఈ క్రమంలో రాత్రి 10గంటల సమయంలో వల్లపు సాంబయ్య, గంజి శ్రీకాంత్, గుండాల ప్రవీణ్ కలిసి గోపీని పని ఉందని తీసుకెళ్లారు. ఊరిచివర కాపుకాసిన మల్లయ్య.. గోపీని కర్రలు, బరిసెలతో దాడి చేసి హత్య చేశాడు” అని పోలీసులు తెలిపారు.