Doctor Rape : దారుణం… బర్త్‌డే పార్టీకి పిలిచి మహిళా డాక్టర్‌పై అత్యాచారం

ఉన్నత విద్యను అభ్యసించి గౌరవప్రదమైన వృత్తిలో ఉంటున్న వారు కూడా పెడదోవ పడుతున్నారు. కామంతో కళ్లు మూసుకుపోయి అఘాయిత్యాలకు తెగబడుతున్నారు.

Doctor Rape : దారుణం… బర్త్‌డే పార్టీకి పిలిచి మహిళా డాక్టర్‌పై అత్యాచారం

Doctor Rape

Doctor Rape : మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు నిర్భయ లాంటి కఠిన చట్టాలు తెచ్చినా, రేపిస్టులను ఎన్ కౌంటర్ చేస్తున్నా.. ఫలితం లేకుండా పోతోంది. మానవ మృగాల్లో మార్పు రావడం లేదు. చిన్నారులు, యవతులు, మహిళలకు రక్షణ కరువైంది. కామంతో కళ్లు మూసుకుపోయి కామాంధులు దారుణాలకు ఒడిగడుతున్నారు. దేశవ్యాప్తంగా నిత్యం ఎక్కడో ఒక చోట అత్యాచార ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. మహిళ ఒంటరిగా రోడ్డుపైకి రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. చిన్న, పెద్ద అనే తేడా లేదు.. ఎవరికీ రక్షణ లేకుండా పోతోంది. నిత్యకృత్యంగా మారిన లైంగిక దాడులు, అత్యాచారాలు ఆడపిల్లల తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేశాయి.

Power Cut : ఏపీలో రోజూ 4 గంటలు కరెంట్ కట్..? ఇందులో నిజమెంత

ఉన్నత విద్యను అభ్యసించి గౌరవప్రదమైన వృత్తిలో ఉంటున్న వారు కూడా పెడదోవ పడుతున్నారు. కామంతో కళ్లు మూసుకుపోయి అఘాయిత్యాలకు తెగబడుతున్నారు. తాజాగా ఢిల్లీలో దారుణం జరిగింది. ఎయిమ్స్ లో డాక్టర్ గా పని చేసే మహిళపై తోటి సీనియర్ డాక్టర్ అత్యాచారం చేశాడు.

Breakfast : ఉదయం బ్రేక్ ఫాస్ట్ మానేస్తే అనారోగ్య సమస్యలు తప్పవా?..

బాధితురాలు.. తన సహచర డాక్టర్ ఆహ్వానం మేరకు అతడి బర్త్‌డే పార్టీకి వెళ్లింది. ఆమెపై కన్నేసిన డాక్టర్ ఇదే అదనుగా కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఇచ్చాడు. అది తాగి ఆమె మత్తులోకి జారుకోగానే లైంగిక దాడికి పాల్పడ్డాడు. అక్టోబర్‌ 10న ఈ సంఘటన జరగ్గా.. బాధితురాలి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదు మేరకు నిందితుడిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.

తాను మత్తులోకి జారుకోగానే తనపై లైంగిక దాడి జరిగిందని బాధితురాలు వాపోయింది. మరుసటి రోజు మెలకువ వచ్చిందని, ఎవరికైనా చెప్తే చంపేస్తానని అతడు తనను బెదిరించాడని ఆమె పోలీసులతో చెప్పింది. చివరకు 5 రోజుల తర్వాత ధైర్యం చేసిన ఆమె.. హౌజ్‌ ఖాస్‌ పోలీసులను ఆశ్రయించింది. తనపై లైంగికదాడికి పాల్పడిన డాక్టర్ పై ఫిర్యాదు చేసింది.