ED Granite Companies : గ్రానైట్ కంపెనీల్లో భారీగా హవాలా డబ్బు గుర్తించిన ఈడీ

తెలంగాణలోని పలు గ్రానైట్ కంపెనీల్లో రెండు రోజులుగా సోదాలు చేసిన ఈడీ అధికారులు సుమారు కోటి రూపాయల 80లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నారు.

ED Granite Companies : గ్రానైట్ కంపెనీల్లో భారీగా హవాలా డబ్బు గుర్తించిన ఈడీ

Updated On : November 11, 2022 / 8:27 PM IST

ED Granite Companies : తెలంగాణలోని పలు గ్రానైట్ కంపెనీల్లో రెండు రోజులుగా సోదాలు చేసిన ఈడీ అధికారులు కీలక సమాచారాన్ని రాబట్టారు. ఫెమా చట్టం ఉల్లంఘనతో తనిఖీలు చేసిన ఈడీ అధికారులు.. రెండు రోజుల సోదాల్లో సుమారు కోటి రూపాయల 80లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

చైనా, హాంగ్ కాంగ్ కు చెందిన కంపెనీల పాత్రపై ఆరా తీసింది ఈడీ. హవాలా రూపంలో పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు ఈడీ అధికారులు.

రాష్ట్రంలోని గ్రానైట్ కంపెనీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే హైదరాబాద్, కరీంనగర్, తదితర ప్రాంతాల్లో ఈడీ అధికారులు దాడులు చేసిన విషయం తెలిసిందే.

కరీంనగర్‌లోని 9 గ్రానైట్ సంస్థలు అక్రమాలకు పాల్పడ్డాయని కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఎన్జీటీ, కేంద్ర పర్యావరణ శాఖకు ఏడాది క్రితం ఫిర్యాదు అందింది. ఆ ఫిర్యాదులు ఆధారంగా దర్యాప్తు సంస్థలు సోదాలు నిర్వహిస్తున్నాయి. ఈడీ, ఐటీ శాఖ అధికారులు 20 బృందాలుగా విడిపోయి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మంలోని గ్రానైట్ సంస్థల యజమానుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో పలు కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.