Ek Mini Katha : అమెజాన్ ప్రైమ్‌లో ‘ఏక్ మినీ కథ’..!
ప్రస్తుత పరిస్థితుల్లో ఓటీటీలో రిలీజ్ చెయ్యడమే బెటర్ అనుకుని పాపులర్ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ ద్వారా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చెయ్యాలని ఫిక్స్ అయిపోయారు..

Ek Mini Katha
Ek Mini Katha: ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి.. ఒకొక్కరుగా షూటింగ్స్ స్టార్ట్ చేసుకుంటున్నారు.. వరుసగా రిలీజులు ప్లాన్ చేసుకుంటున్నారు.. కొద్ది రోజుల్లో తిరిగి కోలుకుంటాం అనుకుంటున్న సినిమా పరిశ్రమపై కరోనా సెకండ్ వేవ్ గట్టి దెబ్బే కొట్టింది.. థియేటర్లు ఎప్పుడు పున:ప్రారంభమవుతాయో క్లారిటీ లేదు.. దీంతో మేకర్స్ తమ సినిమాలను ఓటీటీల్లో విడుదల చెయ్యడానికి సిద్ధమవుతున్నారు..
ప్రముఖ దర్శకుడు (వర్షం, బాబి, చంటి) శోభన్ కుమారుడిగా ‘గోల్కొండ హైస్కూల్’ తో తెలుగు తెరకి పరిచయమై ‘పేపర్ బాయ్’ చిత్రంతో ప్రేక్షకుల చేత నటుడిగా మంచి మార్కులు వేయించుకున్న యంగ్ హీరో సంతోష్ శోభన్, కావ్య తాపర్ జంటగా నటిస్తున్న సినిమా ‘ఏక్ మినీ కథ’..
ఏప్రిల్ 30న ప్రేక్షకుల మందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు. కట్ చేస్తే, ప్రస్తుత పరిస్థితుల్లో ఓటీటీలో రిలీజ్ చెయ్యడమే బెటర్ అనుకుని పాపులర్ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ ద్వారా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చెయ్యాలని ఫిక్స్ అయిపోయారు.. మే 27 నుండి ‘ఏక్ మినీ కథ’ అమెజాన్‌లో స్ట్రీమింగ్ కానుంది..