Navneet Rana
Navneet Rana: ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు ఆ రాష్ట్ర ఎంపీ నవనీత్ కౌర్. రాష్ట్రంలో ఉద్ధవ్ థాక్రే గూండాయిజం నశించాలని ఆమె కోరారు. మహరాష్ట్రలోని అమరావతి నుంచి నవనీత్ కౌర్ స్వంతంత్ర ఎంపీగా కొనసాగుతున్నారు.
Uddhav Thackeray: బాలాసాహెబ్ పేరు వాడుకోవద్దు: రెబల్స్‌కు ఉద్ధవ్ వార్నింగ్
ఇటీవల హనుమాన్ చాలీసా వివాదం నేపథ్యంలో ఉద్ధవ్ సర్కారు నవనీత్ కౌర్‌తో, ఆమె భర్తను కూడా అరెస్టు చేయించిన సంగతి తెలిసిందే. మహారాష్ట్రలో అధికార శివసేన పార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసిన సంగతి తెలిసిందే. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో నవనీత్ కౌర్ స్పందించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. ‘‘ఉద్ధవ్ థాక్రేను వదిలి, తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేల కుటుంబాలకు రక్షణ కల్పించాల్సిందిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కోరుతున్నా. వాళ్లు బాలాసాహెబ్ సిద్ధాంతాలను కొనసాగిస్తున్నారు. ఉద్ధవ్ థాక్రే గూండాయిజం అంతం కావాలి. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలి’’ అని కోరుతున్నట్లు చెప్పారు నవనీత్ కౌర్.
Teachers: టీచర్లు ఆస్తి వివరాలు ఇవ్వాల్సిందే: తెలంగాణ విద్యాశాఖ
మహారాష్ట్రలో తిరుగుబాటు ఎమ్మెల్యేలకు చెందిన కార్యాలయాలు, ఆస్తులను శివసేన కార్యకర్తలు ధ్వంసం చేస్తున్నారు. అందువల్లే తిరుగుబాటు ఎమ్యెల్యేల కుటుంబాలకు రక్షణ కల్పించాలని ఆమె డిమాండ్ చేశా. ఈ ఘటనల నేపథ్యంలో పోలీసులు ఎమ్మెల్యేల కార్యాలయాలు, ఇండ్ల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.