Teachers: టీచర్లు ఆస్తి వివరాలు ఇవ్వాల్సిందే: తెలంగాణ విద్యాశాఖ

కొందరు ఉపాధ్యాయులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడంతోపాటు, ఇతర మార్గాల్లో ఆదాయం పొందుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వీటిపై ఇటీవల తెలంగాణ విద్యాశాఖ దృష్టి పెట్టింది. దీనిలో భాగంగా నల్గొండ జిల్లాకు చెందిన ఒక ఉపాధ్యాయుడి వ్యవహారంపై విజిలెన్స్ శాఖ విచారణ జరిపింది.

Teachers: టీచర్లు ఆస్తి వివరాలు ఇవ్వాల్సిందే: తెలంగాణ విద్యాశాఖ

Teachers

Teachers: ఇకపై తెలంగాణలో పని చేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా ప్రతి సంవత్సరం ఆస్తి వివరాలు సమర్పించాల్సిందే అని తెలంగాణ విద్యా శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి తెలంగాణ విద్యా శాఖ శనివారం నూతన మార్గదర్శకాల్ని విడుదల చేసింది. కొందరు ఉపాధ్యాయులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడంతోపాటు, ఇతర మార్గాల్లో ఆదాయం పొందుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వీటిపై ఇటీవల తెలంగాణ విద్యాశాఖ దృష్టి పెట్టింది. దీనిలో భాగంగా నల్గొండ జిల్లాకు చెందిన ఒక ఉపాధ్యాయుడి వ్యవహారంపై విజిలెన్స్ శాఖ విచారణ జరిపింది.

Embryos Found: డ్రైనేజీలో ఏడు పిండాలు లభ్యం

ఈ విచారణపై ఇచ్చిన నివేదిక ఆధారంగా, అలాగే ఉపాధ్యాయులపై ఉన్న ఇతర ఆరోపణలను దృష్టిలో ఉంచుకుని తాజా ఆదేశాలు జారీ చేసింది. ఈ మార్గదర్శకాల ప్రకారం.. ఇకపై ఉపాధ్యాయులు ఫ్లాట్లు, ప్లాట్లు వంటి స్థిర, చర ఆస్తులు అమ్మినా, కొన్నా తెలంగాణ విద్యాశాఖకు తెలియజేసి, అనుమతి తీసుకోవాలి. ప్రతి ఏడాది వార్షిక ఆదాయ, ఆస్తుల వివరాలను సమర్పించాలి. దీనిపై టీచర్లు, ఉద్యోగులకు తగిన సూచనలు ఇవ్వాలని ఆర్‌జేడీ, డీఈవోలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం టీచర్లు ఆస్తులు అమ్మినా, కొన్నా ముందుగా అనుమతి తీసుకోవాల్సిందే.