Embryos Found: డ్రైనేజీలో ఏడు పిండాలు లభ్యం

ఈ పిండాలు అన్నీ ఐదు నుంచి ఏడు నెలల వయసు ఉన్నవి కావడం గమనార్హం. లింగ నిర్ధరణ పరీక్షలు జరిపి, ఆ పిండాలను తొలగించినట్లుగా స్థానికులు చెబుతున్నారు. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు, వైద్య సిబ్బంది అక్కడికి చేరుకుని పిండాలను స్వాధీనం చేసుకున్నారు.

Embryos Found: డ్రైనేజీలో ఏడు పిండాలు లభ్యం

Embryos Found

Embryos Found: కర్ణాటకలోని బెలగావి జిల్లాలో దారుణం జరిగింది. ముదల్గి బస్టాండ్ సమీపంలోని ఒక డ్రైనేజీ కాలువలో ఏడు పిండాలు లభ్యమయ్యాయి. నీటిపై తేలియాడుతున్న ఐదు పెట్టెలను శుక్రవారం స్థానికులు గుర్తించారు. వీటిని పరిశీలించి చూడగా, ఏడు పిండాలు బయటపడ్డాయి. ఈ పిండాలు అన్నీ ఐదు నుంచి ఏడు నెలల వయసు ఉన్నవి కావడం గమనార్హం. లింగ నిర్ధరణ పరీక్షలు జరిపి, ఆ పిండాలను తొలగించినట్లుగా స్థానికులు చెబుతున్నారు. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు, వైద్య సిబ్బంది అక్కడికి చేరుకుని పిండాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని పోస్టుమార్టమ్ కోసం తరలించారు.

PM Modi: కళా ప్రేమికుల కోసం అందుబాటులోకి ప్రగతి మైదాన్ టన్నెల్

లింగ నిర్ధరణ పరీక్షల ద్వారా ఆడ శిశువులు అని తేలడం వల్లే వాటిని తొలగించి ఉండొచ్చని వైద్య అధికారులు అనుమానిస్తున్నారు. ఈ పిండాలు ఎక్కడి నుంచి వచ్చాయి అని తెలుసుకునేందుకు కుటుంబ సంక్షేమ, ఆరోగ్య శాఖ, పోలీసులు కలిపి విచారణ జరుపుతున్నారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధం ఉందని భావిస్తున్న ఒక స్థానిక మెటర్నిటీ క్లినిక్‌ను అధికారులు సీజ్ చేశారు. ఘటనకు గల కారణాలు తెలుసుకునేందుకు అధికారులు అన్ని అంశాలపై విచారణ జరుపుతున్నారు. అయితే, బెలగావి జిల్లాలో ఇలా పిండాలు బయటపడటం ఇదే మొదటిసారి కాదు. 2013లో కూడా ఒకేసారి 13 పిండాలు బయటపడ్డాయి.