Uddhav Thackeray: బాలాసాహెబ్ పేరు వాడుకోవద్దు: రెబల్స్‌కు ఉద్ధవ్ వార్నింగ్

ఉద్ధవ్ థాక్రే అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో బాలాసాహెబ్ థాక్రే పేరును ఎవరూ వాడుకోవడానికి వీల్లేదని తీర్మానం చేశారు. అలా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా సీఎం ఉద్ధవ్ థాక్రే మాట్లాడారు. ‘‘తిరుగుబాటు ఎమ్మెల్యేలు వాళ్లకు నచ్చింది చేసుకోవచ్చు.

Uddhav Thackeray: బాలాసాహెబ్ పేరు వాడుకోవద్దు: రెబల్స్‌కు ఉద్ధవ్ వార్నింగ్

Uddhav Thackeray

Uddhav Thackeray: బాలాసాహెబ్ థాక్రే పేరును రాజీకీయాల్లో ఎవరూ వాడుకోవడానికి వీల్లేదన్నారు శివసేన అధినేత, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే. ఆయన బాలాసాహెబ్ తనయుడు అనే సంగతి తెలిసిందే. మహారాష్ట్రలో అధికార శివసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల తిరుగుబాటు నేపథ్యంలో శనివారం ఆ పార్టీ జాతీయ కార్యవర్గ భేటీ జరిగింది.

Teachers: టీచర్లు ఆస్తి వివరాలు ఇవ్వాల్సిందే: తెలంగాణ విద్యాశాఖ

ఉద్ధవ్ థాక్రే అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో బాలాసాహెబ్ థాక్రే పేరును ఎవరూ వాడుకోవడానికి వీల్లేదని తీర్మానం చేశారు. అలా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా సీఎం ఉద్ధవ్ థాక్రే మాట్లాడారు. ‘‘తిరుగుబాటు ఎమ్మెల్యేలు వాళ్లకు నచ్చింది చేసుకోవచ్చు. వాళ్ల విషయాల్లో నేను జోక్యం చేసుకోను. వాళ్లకు నచ్చిన నిర్ణయం తీసుకోవచ్చు. అయితే, బాలాసాహెబ్ పేరును, శివసేన అనే పేర్లను ఎవరూ వాడుకోవడానికి వీల్లేదు’’ అని చెప్పుకొచ్చారు. షిండే ఆధ్వర్యంలోని తిరుగుబాటు ఎమ్మెల్యేలు ‘బాలాసాహెబ్ శివసేన’ పేరుతో కొత్త పార్టీ పెట్టబోతున్నారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉద్ధవ్ థాక్రే తన తండ్రి పేరును, తన పార్టీ పేరును ఎవరూ వాడుకోవడానికి వీల్లేదని సూచించారు. ఈ మేరకు ఎలక్షన్ కమిషన్‌ను కూడా కలిసి ఫిర్యాదు చేయనున్నారు.

Embryos Found: డ్రైనేజీలో ఏడు పిండాలు లభ్యం

తిరుగుబాటు ఎమ్మెల్యేల్లో ఒకరైన దీపక్ కేశార్కర్ మాట్లాడుతూ కొత్త పార్టీపై షిండే నిర్ణయం తీసుకుంటారని, తామే బాలసాహెబ్ అసలైన వారసులమని చెప్పాడు. తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ శివసేన పార్టీ ఎలక్షన్ కమిషన్‌ను కలిసి ఫిర్యాదు చేయబోతుంది. డిప్యూటీ స్పీకర్ ఆధ్వర్యంలో 16 మంది శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సంబంధించి నోటీసులు జారీ అయ్యాయి.