RRR: ఎత్తర జెండా పాట.. వాయిదా!

టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ నుండి ఎలాంటి అప్‌డేట్ వచ్చినా ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు.

Rrr Etthara Jenda

RRR: టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ నుండి ఎలాంటి అప్‌డేట్ వచ్చినా ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు. అయితే ఈ సినిమాను ఇప్పటికే పలుమార్లు వాయిదా వేసిన చిత్ర యూనిట్, ఎట్టకేలకు ఈనెల 25న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యింది. ఇక బాహుబలి తరువాత దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ పీరియాడికల్ ఫిక్షన్ మూవీ కోసం అన్ని భాషల ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా నుండి ‘ఎత్తర జెండా’ అనే పాటను ఇవాళ సాయంత్రం 4 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది.

RRR: నెత్తురు మరిగితే ఎత్తర జెండా.. ఆర్ఆర్ఆర్ నుండి మరో పాట

కానీ తాజాగా మరోసారి ఆర్ఆర్ఆర్ యూనిట్ ప్రేక్షకులకు ఎదురుచూపులనే మిగిల్చింది. ఎత్తర జెండా పాటను కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా ఇవాళ రిలీజ్ చేయడం లేదని.. ఈ పాటను రేపు(మార్చి 15) ఉదయం 10 గంటలకు ఖచ్చితంగా రిలీజ్ చేస్తామని ఆర్ఆర్ఆర్ యూనిట్ ప్రకటించింది. దీంతో ఈ పాట కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు మరోసారి నిరాశే మిగిలింది.

ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమా వరుసగా వాయిదా పడుతూ వస్తుండటంతో ప్రేక్షకులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఇలా లిరికల్ పాటను కూడా అనుకున్న సమయానికి రిలీజ్ చేయకపోవడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. అసలే టాలీవుడ్ బెస్ట్ హీరోలైన రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్‌లో నెలకొన్నాయి. ఇక ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించడంతో ఈ సినిమా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

RRR: ఎన్టీఆర్-చరణ్ పట్టిన జెండా కథ ఏంటో తెలుసా..?

మరి ఈ సినిమాలోని ఎత్తర జెండా పాటను ఈసారైనా చెప్పిన సమయానికి రిలీజ్ చేస్తారా లేక మళ్లీ వాయిదా వేస్తారా అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. జక్కన్న తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా, తారక్ కొమురం భీం పాత్రలో కనిపిస్తాడు. బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న ‘ట్రిపుల్ ఆర్’లో అందాల భామ ఆలియా భట్, ఒలివియా మారిస్‌లు హీరోయిన్లుగా నటించారు. డివివి దానయ్య ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్న సంగతి తెలిసిందే.