Tummala Nageshwarao: మాజీ మంత్రి తుమ్మల దారెటు? నేడు కార్యకర్తలతో భేటీ.. పార్టీ మారుతారా?

మాజీ మంత్రి, ఉమ్మడి ఖమ్మం జిల్లా సీనియర్ నేత తుమ్మల నాగేశ్వర్ రావు గురువారం తన కార్యకర్తలు, అనుచరులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో ఆయన తన రాజకీయ భవిష్యత్‌పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Tummala Nageshwarao: ఉమ్మడి ఖమ్మం జిల్లా సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు రాజకీయ భవిష్యత్ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తన రాజకీయంపై ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని అభిమానులు, కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీలో తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని తుమ్మల కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు.

Sania Mirza: సానియా-షోయబ్ ఇప్పటికే విడిపోయారా? అసలు విషయం చెప్పిన స్నేహితులు

ఈ నేపథ్యంలో గురువారం ఆయన తన కార్యకర్తలు, అనుచరులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించబోతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ములుగు జిల్లా వాజేడులో ఈ సమావేశం జరుగుతుంది. తుమ్మల తన స్వగ్రామమైన గండుగులపల్లి నంచి వాజేడు వరకు భారీ ర్యాలీ నిర్వహించబోతున్నారు. గండుగులపల్లి నుంచి భద్రాచలం, దుమ్మగూడెం, చర్ల, వెంకటాపురం మండలాల మీదుగా వాజేడుకు సుమారు 300 వాహనాలతో భారీ కాన్వాయ్‌లో బయల్దేరుతారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న అభిమానులు భారీ స్థాయిలో ఈ సమ్మేళనానికి తరలివచ్చే అవకాశం ఉంది. భారీ ర్యాలీ, ఆత్మీయం సమ్మేళనం నిర్వహిస్తుండటం రాజకీయంగా చర్చకు తావిస్తోంది. ఈ సమ్మేళనం ద్వారా తుమ్మల తనకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎంతటి బలం ఉందో నిరూపించాలనుకుంటున్నారు.

India vs England: నేడు ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ సెమీఫైనల్.. ఇండియా-పాక్ ఫైనల్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్

దీంతోపాటు ఆయన అభిమానులు అందరినీ ఒకే వేదికపైకి తెస్తున్నారు. ఈ సమ్మేళనంలో తుమ్మల ఏం ప్రసంగిస్తారు.. ఏం ప్రకటిస్తారు అనే అంశంపై కూడా ఆసక్తి నెలకొంది. అభిమానులను ఉత్సాహపరిచేలా తుమ్మల ప్రసంగించి, రాజకీయ నిర్ణయం తీసుకుంటారా.. లేక తన రాజకీయ అడుగులు ఎటువైపు అనేది ఇప్పుడే వెల్లడించకుండా మరికొంతకాలం నాన్చుతారా అనేది ఈ సమ్మేళనం ద్వారా తేలుతుంది. టీఆర్ఎస్‌లోనే కొనసాగడమో లేక మరో పార్టీలోకి చేరడమో తేల్చే అవకాశాలున్నాయి. అలాగే ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే విషయంపై కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

 

ట్రెండింగ్ వార్తలు