Sania Mirza: సానియా-షోయబ్ ఇప్పటికే విడిపోయారా? అసలు విషయం చెప్పిన స్నేహితులు

భారత మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఇప్పటికే విడాకులు తీసుకుందా? షోయబ్ మాలిక్‌తో ఆమె విడిపోయారా? ఈ విషయంలో వాళ్లిద్దరి సన్నిహితులు స్పందించారు.

Sania Mirza: సానియా-షోయబ్ ఇప్పటికే విడిపోయారా? అసలు విషయం చెప్పిన స్నేహితులు

Sania Mirza: ఇండియన్ టెన్నిస్ మాజీ ప్లేయర్ సానియా మీర్జా-పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ విడాకుల అంశంపై చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. వారిద్దరూ కొంతకాలంగా వేరుగా ఉంటున్నట్లు, విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Sanjay Raut: సంజయ్ రౌత్‌కు బెయిల్ మంజూరు.. ఆయన అరెస్టు అక్రమమని కోర్టు వ్యాఖ్య

సానియా మీర్జా ఇటీవల తన సోషల్ మీడియాలో చేస్తున్న కొన్ని పోస్టులు కూడా దీనికి మరో కారణం. ఈ అంశంపై సానియా-షోయబ్ అధికారికంగా స్పందించింది లేదు. అయితే, సానియా, షోయబ్ సన్నిహితులు మాత్రం ఈ అంశంపై స్పందించారు. సానియా స్నేహితులు చెబుతున్న దాని ప్రకారం.. వారిద్దరూ విడాకులు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయంపై ఇప్పటికే ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చారు. విడాకులకు సంబంధించిన ప్రక్రియ కూడా పూర్తైంది. అయితే, అధికారికంగా ఇంకా విడాకులు మంజూరు కావాల్సి ఉంది.

Minister Gangula On ED Raids : ఇంటి తాళాలు పగలగొట్టాలని నేనే చెప్పా.. ఈడీ, ఐటీ దాడులపై మంత్రి గంగుల రియాక్షన్

మరోవైపు షోయబ్ మాలిక్‌కు చెందిన పాక్ క్రికెట్ మేనేజ్‌మెంట్‌ సభ్యులు కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. వాళ్లిద్దరూ విడిపోయినట్లు, విడాకులు తీసుకుంటున్నట్లు పాక్ క్రికెట్ సభ్యులు వెల్లడించారు. ప్రస్తుతం సానియా మీర్జా దుబాయ్‌లో ఉంటుండగా, షోయబ్ మాలిక్ పాకిస్తాన్‌లో ఉంటున్నాడు. ఇటీవల వాళ్ల పుట్టిన రోజు వేడుకల సందర్భంలో మాత్రం దుబాయ్‌లో కలుసుకున్నారు.