Hey Chikittha Teaser : ‘హే చికీతా’ టీజర్ రిలీజ్.. పవన్ కళ్యాణ్ ప్రేరణతో రైతులపై సినిమా తీశామంటున్న దర్శకుడు..
మీరు కూడా హే చికీతా టీజర్ చూసేయండి.. (Hey Chikittha Teaser)
Hey Chikittha Teaser
Hey Chikittha Teaser : అభినవ్ మణికంఠ, దివిజ, తన్మయి కుషి ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా హే చికీతా. అమరావతి మూవీ మేకర్స్, సుందరకాండ మోషన్ పిక్చర్స్ ఎల్ఎల్పి బ్యానర్స్ పై ఎన్.అశోక ఆర్ఎన్ఎస్, గరుడవేగ అంజి నిర్మాణంలో ధన్ రాజ్ లెక్కల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. హే చికీతా సినిమా జూలై 24న రిలీజ్ కానుండగా తాజాగా ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించి టీజర్ రిలీజ్ చేసారు. ఈ ఈవెంట్ కి సినిమాటోగ్రాఫర్ కె.కె. సెంథిల్ కుమార్, దర్శకులు జి.నాగేశ్వర్ రెడ్డి, నిర్మాతలు సి.కళ్యాణ్, దామోదర్ ప్రసాద్.. పలువురు గెస్టులుగా హాజరయ్యారు.
మీరు కూడా హే చికీతా టీజర్ చూసేయండి..
Also Read : Save The Tigers : ‘సేవ్ ది టైగర్స్’ మూడు సీజన్స్ హిట్.. ఇప్పుడు సీజన్ 4 కూడా.. ఈసారి స్టార్ హీరో..
టీజర్ లాంచ్ ఈవెంట్ అనంతరం నిర్మాత సి. కళ్యాణ్ మాట్లాడుతూ.. అంజి నా శిష్యుడు. అంజి పక్కన ఉన్నాడు కాబట్టి దర్శకుడు సినిమాని బాగానే తీసి ఉంటారు. మా ప్రభాకర్ కూతురు దివిజను చూస్తుంటే మా ఇంటి నుంచే హీరోయిన్ వస్తున్నట్టుంది అని అన్నారు. ప్రభాకర్ మాట్లాడుతూ.. ధన్ రాజ్ ఈ కథను చెప్పినప్పుడు ఫస్ట్ హాఫ్ అంతా నవ్వుకుని ఎంజాయ్ చేశాం. ఈ కథే ఈ సినిమాకు హీరో. రైతే రాజు అనే కాన్సెప్ట్, పవనిజంకి చాలా లింక్ ఉంటుంది. ధన్ రాజ్ తన ఊర్లో జరిగిన ఘటనల్ని అల్లుకుని ఈ కథను రాసుకున్నారు. సింగిల్ షెడ్యూల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేశారు అని తెలిపారు.

డైరెక్టర్ ధన్ రాజ్ లెక్కల మాట్లాడుతూ.. నేను పవన్ కళ్యాణ్ వీరాభిమాని. ఊర్లో ఉండే ఓ ఐదుగురు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏం చేశారు అన్నది ఈ సినిమా కథ. అందుకే హే చికీతా టైటిల్ పెట్టాం. పవన్ కళ్యాణ్ ప్రతీ సినిమాలో ఇంట్రో సాంగ్‌లో మూడు నిమిషాల పాటు సందేశాన్ని ఇస్తారు. నేను అదే లైన్‌తో రైతుల గురించి మూడు గంటల పాటు సినిమా తీశాను అని తెలిపారు. నిర్మాత గరుడవేగ అంజి మాట్లాడుతూ.. కొత్త కథల్ని అందించాలనే ఉద్దేశంతోనే ఈ బ్యానర్లను ప్రారంభించాం. మా ఆధ్వర్యంలో మరిన్ని మంచి సినిమాలు వస్తాయి. జూలై 24న మా సినిమా రిలీజ్ కానుంది అని తెలిపారు.
Also Read : Aadarsha Kutumbam : వెంకీ మామ ‘ఆదర్శ కుటుంబం’ వచ్చేస్తుంది.. రిలీజ్ డేట్ అనౌన్స్.. ఎప్పుడంటే..?
సీనియర్ దర్శకులు నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ సినిమా నేను ఆల్రెడీ చూశాను. చాలా బాగుంది. ధన్ రాజ్‌కి తెలంగాణ ప్రాంతం మీద చాలా పట్టుంది. అదే మనకు తెరపై కనిపిస్తుంది. సినిమాలో పవనిజం ఉంటుంది అని తెలిపారు.
