Save The Tigers : ‘సేవ్ ది టైగర్స్’ మూడు సీజన్స్ హిట్.. ఇప్పుడు సీజన్ 4 కూడా.. ఈసారి స్టార్ హీరో..
రిలీజైన మూడు సీజన్స్ మంచి విజయం సాధించడంతో నాలుగో సీజన్ కి కూడా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. (Save The Tigers)
Save The Tigers
Save The Tigers : తెలుగులో సక్సెస్ఫుల్ వెబ్ సిరీస్ లలో ‘సేవ్ ది టైగర్స్’ ఒకటి. భార్య భర్తల మధ్య సంబంధాలను కామెడీతో ఎమోషన్ తో ఈ సిరీస్ ని తెరకేక్కిన్చారు. ఇప్పటివరకు మూడు సీజన్స్ రిలీజవ్వగా మూడు సూపర్ హిట్ అయ్యాయి. ఇటీవలే వచ్చిన మూడో సిరీస్ అయితే సరికొత్తగా వేరే లోకం, అన్ని జంటలు ఇద్దరు ఇద్దరుగా డబల్ రోల్స్ తో ప్రేక్షకులను మెప్పించాయి. ఈ సారి కామెడీ కంటే ఎమోషన్ బాగా వర్కౌట్ అయింది.
రిలీజైన మూడు సీజన్స్ మంచి విజయం సాధించడంతో నాలుగో సీజన్ కి కూడా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం సేవ్ ది టైగర్స్ సీజన్ 3 జియో హాట్స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే సీజన్ 4 లో ఓ స్టార్ హీరోని గెస్ట్ పైరెన్స్ గా తీసుకురావాలని కూడా ప్లాన్ చేస్తున్నారట. ప్రతి సీజన్ లో ఎవరో ఒకరు స్పెషల్ పాత్రతో అలరిస్తున్నారు. సీరత్ కపూర్, వెన్నెల కిషోర్.. ఇలా పలువురు స్టార్స్ ఈ సిరిస్ లో స్పెషల్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు.
Also See : Yashashree Rao : తెలుగులో ఎంట్రీ ఇస్తున్న ముంబై సోషల్ మీడియా స్టార్.. యశశ్రీ రావు ఫొటోలు..
ఇప్పుడు సీజన్ 4 ప్లాన్ చేస్తూ అందులో ఓ టాలీవుడ్ స్టార్ హీరోని స్పెషల్ అప్పీరెన్స్ ఇప్పించాలని ఈ సిరీస్ షో రన్నర్ మహి వి రాఘవ్ ట్రై చేస్తున్నారు. దీంతో మరోసారి సేవ్ ది టైగర్స్ భార్య భర్తల గిల్లి కజ్జాలు, కామెడీ, ఎమోషన్స్ తో ప్రేక్షకులను మెప్పించడానికి సీజన్ 4 తో వస్తారని తెలుస్తుంది.
