Ahmedabad Hospital : అహ్మదాబాద్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం..100 మంది రోగుల తరలింపు
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలోని ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. సాహిబాగ్ ప్రాంతంలో ఉన్న రాజస్థాన్ హాస్పిటల్ బేస్‌మెంట్‌లో ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటలకు మంటలు చెలరేగాయని సాహిబాగ్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు....
- saleem sk
- Published On : July 30, 2023 / 09:28 AM IST
Ahmedabad Hospital
Ahmedabad Hospital : గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలోని ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. సాహిబాగ్ ప్రాంతంలో ఉన్న రాజస్థాన్ హాస్పిటల్ బేస్‌మెంట్‌లో ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటలకు మంటలు చెలరేగాయని సాహిబాగ్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. (Fire At Ahmedabad Hospital) ఆసుపత్రిలోని రెండవ బేస్ మెంట్ లో అగ్నిప్రమాదం జరిగింది.
Thailand : థాయ్‌లాండ్‌లో బాణసంచా గోదాం పేలుడు, 10 మంది మృతి, 118 మందికిపైగా గాయాలు
దీంతో ముందు జాగ్రత్తగా ఆసుపత్రిలో ఉన్న 100 మంది రోగులను ఇతర ఆసుపత్రులకు తరలించారు. (100 Patients Evacuated) హుటాహుటిన వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నా ఇంకా పొగ వస్తూనే ఉంది. ఛారిటబుల్ ట్రస్టు నిర్వహిస్తున్న ఈ ఆసుపత్రిలో అగ్నిప్రమాదానికి కారణాలు తెలియలేదు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.
