Thailand : థాయ్‌లాండ్‌లో బాణసంచా గోదాం పేలుడు, 10 మంది మృతి, 118 మందికిపైగా గాయాలు

థాయ్‌లాండ్‌ దేశంలో భారీ పేలుడు జరిగింది. దక్షిణ థాయ్‌లాండ్‌లో బాణాసంచా గోదాంలో జరిగిన భారీ పేలుడులో 10 మంది మృతి చెందగా, మరో 118 మందికిపైగా గాయపడ్డారని ప్రభుత్వ అధికారులు తెలిపారు....

Thailand : థాయ్‌లాండ్‌లో బాణసంచా గోదాం పేలుడు, 10 మంది మృతి, 118 మందికిపైగా గాయాలు

Thailand Explosion

Updated On : July 30, 2023 / 7:43 AM IST

Thailand Explosion : థాయ్‌లాండ్‌ దేశంలో భారీ పేలుడు జరిగింది. దక్షిణ థాయ్‌లాండ్‌లో బాణాసంచా గోదాంలో జరిగిన భారీ పేలుడులో 10 మంది మృతి చెందగా, మరో 118 మందికిపైగా గాయపడ్డారని ప్రభుత్వ అధికారులు తెలిపారు. (Thailand) మలేషియా సరిహద్దులోని నారాతివాట్ ప్రావిన్స్‌లోని మార్కెట్‌లో జరిగిన పేలుడు ధాటికి 10 ఇళ్లు ధ్వంసమయ్యాయి. (Fireworks Warehouse Explosion) మరో 100 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని డిప్యూటీ ప్రభుత్వ ప్రతినిధి రచ్చాడ థానాడిరెక్ తెలిపారు.

Himachal Tourists : పర్యాటకులకు శుభవార్త…హిమాచల్ హోటల్ అసోసియేషన్ 50 శాతం డిస్కౌంట్

మంటలు చెలరేగిన గోదాంలో అగ్నిమాపక శాఖ అధికారులు మంటలను అదుపు చేశారు. గోదాం శిథిలాల్లో ఎవరైనా చిక్కుకున్నారా అని అధికారులు వెతుకుతున్నారు. ఈ పేలుడు ఘటనలో గాయపడిన వారిలో 14 మంది పరిస్థితి విషమంగా ఉందని, వారిని ఆసుపత్రికి పంపినట్లు థాయ్‌లాండ్‌ ప్రధాన మంత్రి ప్రయుత్ చాన్ ఓచా చెప్పారు. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రధాని అధికారులను ఆదేశించారు.