Himachal Tourists : పర్యాటకులకు శుభవార్త…హిమాచల్ హోటల్ అసోసియేషన్ 50 శాతం డిస్కౌంట్

పర్యాటకులకు హిమాచల్ పర్యాటక శాఖ, హోటళ్ల సంఘం శుభవార్త వెల్లడించింది. భారీవర్షాలు, వరదల వల్ల దెబ్బతిన్న పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు హిమాచల్ హోటల్ అసోసియేషన్, హిమాచల్ ప్రదేశ్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సంచలన నిర్ణయం తీసుకున్నాయి....

Himachal Tourists : పర్యాటకులకు శుభవార్త…హిమాచల్ హోటల్ అసోసియేషన్ 50 శాతం డిస్కౌంట్

Himachal Tourists

Himachal Tourists : పర్యాటకులకు హిమాచల్ పర్యాటక శాఖ, హోటళ్ల సంఘం శుభవార్త వెల్లడించింది. భారీవర్షాలు, వరదల వల్ల దెబ్బతిన్న పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు హిమాచల్ హోటల్ అసోసియేషన్, హిమాచల్ ప్రదేశ్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సంచలన నిర్ణయం తీసుకున్నాయి. (Himachal Pradesh Tourism Development Corporation) హిమాచల్ ప్రదేశ్‌లోని హోటల్ ఆక్యుపెన్సీ రేటు ఇటీవలి వర్షాలు, వరదల తర్వాత సున్నా శాతానికి చేరుకోవడంతో హోటల్ అసోసియేషన్ పర్యాటకులను ఆకర్షించడానికి హోటల్ రూమ్ టారిఫ్‌లపై 50 శాతం తగ్గింపును ప్రకటించింది. (Himachal hotel association announces) దీంతో పాటు హిమాచల్ ప్రదేశ్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కూడా సెప్టెంబర్ 15వతేదీ వరకు హోటల్ గదుల అద్దెలపై 50 శాతం తగ్గింపును ప్రకటించింది.

Tiger Cub : పులి పిల్లకు పారాలింపిక్ పతక విజేత అవని లేఖరా పేరు…రాజస్థాన్ సీఎం ట్వీట్

కొవిడ్ మహమ్మారి అనంతరం దెబ్బతిన్న పర్యాటక రంగం కోలుకుంటున్న దశలో మళ్లీ భారీవర్షాలు, వరదలు వెల్లువెత్తాయి. దీంతో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో వేలాది పర్యాటకుల బుకింగ్ లు రద్దు అయ్యాయి. ఈసారి హోటళ్లు ఖాళీగా ఉన్నాయి. దీంతో పర్యాటకులను ఆకర్షించడానికి ప్రైవేట్ హోటళ్లు భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేశాయి. దెబ్బతిన్న రోడ్లను ప్రభుత్వం పునరుద్ధరిస్తుందని, హోటల్ గదుల అద్దెలు 50 శాతం తగ్గించామని హిమాచల్ హోటల్స్, రెస్టారెంట్ అసోసియేషన్ల ఫెడరేషన్ అధ్యక్షుడు అశ్వనీ బాంబా చెప్పారు.

Parliament Expenditure: పార్లమెంటులో ఒక్క నిమిషానికి అయ్యే ఖర్చు ఎంతో తెలుసా?

హిమాచల్ ప్రయాణం సురక్షితమని, సెప్టెంబరు నాటికి పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నట్లు హిమాచల్ పబ్లిక్ వర్క్స్ మంత్రి విక్రమాదిత్యసింగ్ చెప్పారు. (Public Works Minister Vikramaditya Singh) రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 75,000 మంది పర్యాటకులను సురక్షితంగా తరలించింది.

Sri Sathyasai District : బాబోయ్.. ఒక్కసారిగా కుప్పకూలిన ప్రభుత్వ పాఠశాల భవనం, షాకింగ్ వీడియో

కొండచరియలు విరిగిపడటం, వరదలు భవనాలను ధ్వంసం చేయడం, కొట్టుకుపోయిన వాహనాలు దెబ్బతిన్న రోడ్లు, అపారమైన ప్రాణ, ఆస్తి నష్టాన్ని కలిగించే వీడియోలు జులై 9వతేదీ నుంచి వైరల్ అయ్యాయి. దీని ఫలితంగా వర్షాకాలంలో పర్యాటకులు కొండ రాష్ట్రానికి రావడానికి భయపడుతున్నారు. జూన్ 24వతేదీ నుంచి రాష్ట్రంలో వర్షాలు, వరదలు, రోడ్డు ప్రమాదాల్లో ఇప్పటివరకు 184 మంది మరణించారు. రాష్ట్ర అత్యవసర ప్రతిస్పందన కేంద్రం ప్రకారం మరో 33 మంది తప్పిపోయారు. ఈ నేపథ్యంలో హిమాచల్ పర్యటన సురక్షితమని మంత్రి విక్రమాదిత్య సింగ్ వీడియోను విడుదల చేశారు.