Tiger Cub : పులి పిల్లకు పారాలింపిక్ పతక విజేత అవని లేఖరా పేరు…రాజస్థాన్ సీఎం ట్వీట్

అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా రణథంబోర్ అభయారణ్యంలోని పులి పిల్లలకు రాజస్థాన్ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పేర్లు పెట్టారు. రాజస్థాన్‌లోని ఓ పులి పిల్లకు పారా ఒలింపిక్ పతక విజేత అవనీ లేఖరా పేరు పెట్టినట్లు ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు....

Tiger Cub : పులి పిల్లకు పారాలింపిక్ పతక విజేత అవని లేఖరా పేరు…రాజస్థాన్ సీఎం ట్వీట్

Tiger Cubs

Tiger Cub : అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా రణథంబోర్ అభయారణ్యంలోని పులి పిల్లలకు రాజస్థాన్ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పేర్లు పెట్టారు. రాజస్థాన్‌లోని ఓ పులి పిల్లకు పారా ఒలింపిక్ పతక విజేత అవనీ లేఖరా పేరు పెట్టినట్లు ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు. (Tiger Cub Named After Paralympic Medallist Avani Lekhara) మరో రెండు పులి పిల్లలకు చిరంజీవి, చిరయు అని పేర్లు పెట్టినట్లు సీఎం వెల్లడించారు.

Cleris Kiss : ఛీ..ఛీ.. బరితెగించిన మతగురువు, అమ్మాయితో అసభ్యకర ప్రవర్తన, అక్కడ తాకుతూ ముద్దులు పెడుతూ.. వీడియో వైరల్

రాజస్థాన్‌ రాష్ట్రంలోని రణతంబోర్‌ అభయారణ్యంలో గత నెలలో ఆరు పులి పిల్లలు పుట్టాయని, రాష్ట్రంలోని అడవులు, వన్యప్రాణులను సంరక్షించేందుకు రాజస్థాన్ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోందని సీఎం అశోక్ గెహ్లాట్ (Chief Minister Ashok Gehlot) చెప్పారు. ‘‘2010వ సంవత్సరం కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ కృష్ణ పూనియా పేరు మీదుగా టైగ్రెస్ టి-17కి కృష్ణ అని పేరు పెట్టారు. అదే విధంగా ఇప్పుడు పుట్టిన పులి పిల్లకు పారాలింపిక్ పతక విజేత అవనిలేఖర పేరు మీద అవని అని పేరు పెట్టాను’’ అని అశోక్ గెహ్లాట్ తెలిపారు.

Revanth Reddy : కిషన్ రెడ్డి వెంటనే వెయ్యి కోట్లు తీసుకురావాలి- రేవంత్ రెడ్డి డిమాండ్

జైపూర్‌కు చెందిన అవనీ లేఖరా టోక్యో 2020 పారాలింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్‌లో బంగారు పతకం, 50 మీటర్ల రైఫిల్ 3 స్థానాల్లో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. పులుల సంరక్షణపై అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం జులై 29వతేదీన అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. (International Tiger Day) దేశంలో పులులు అంతరించిపోయే దశలో ఉన్నప్పుడు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 1973 వ సంవత్సరం ఏప్రిల్ నెలలో ప్రాజెక్ట్ టైగర్ ని ప్రారంభించారని, దీంతో దేశంలో పులుల సంఖ్య అపూర్వంగా పెరిగిందని సీఎం గెహ్లాట్ చెప్పారు.