Rahul Narwekar: మహా స్పీకర్‌గా రాహుల్ నవ్రేకర్?

అధికార శివసేన-బీజేపీ కూటమి తరఫున బీజేపీకి చెందిన రాహుల్ నవ్రేకర్ స్పీకర్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. ఆయన గత ఎన్నికల్లో మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయినప్పటికీ ఆయనను బీజేపీ స్పీకర్ పదవి పోటీకి ఎంపిక చేయడం విశేషం.

Rahul Narwekar: మహారాష్ట్రలో షిండే ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరాక ఇప్పుడు అసెంబ్లీ స్పీకర్‌ను ఎన్నుకునే టైం వచ్చింది. కాగా, అధికార శివసేన-బీజేపీ కూటమి తరఫున బీజేపీకి చెందిన రాహుల్ నవ్రేకర్ స్పీకర్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. ఆయన గత ఎన్నికల్లో మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

Bhagyalakshmi Temple: భాగ్యలక్ష్మీ ఆలయం వద్ద భారీ భద్రత

అయినప్పటికీ ఆయనను బీజేపీ స్పీకర్ పదవి పోటీకి ఎంపిక చేయడం విశేషం. వృత్తిరీత్యా లాయర్ అయిన నవ్రేకర్‌కు అటు ఎన్సీపీతో, ఇటు శివసేనతో మంచి సంబంధాలున్నాయి. అయితే, 2019లో బీజేపీలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. ప్రస్తుతం నవ్రేకర్ బీజేపీ రాష్ట్ర మీడియా వ్యవహారాలు కూడా చూస్తున్నారు. ప్రతిపక్షాల నుంచి పోటీ లేకుండా ఉంటే నవ్రేకర్ నేరుగా ఎన్నికయ్యే అవకాశం ఉండేది. కానీ, మహా వికాస్ అఘాడి (ఎమ్‌వీఏ) తరఫున కూడా స్పీకర్ పదవికి పోటీ చేస్తున్నారు. ఎమ్‌వీఏ తరఫున శివసేన నుంచి రాజన్ సాల్వి పోటీ చేస్తున్నారు. రాజన్ శనివారం నామినేషన్ దాఖలు చేశారు.

Woman Gang-Raped: మహిళ కిడ్నాప్.. నలుగురు అత్యాచారం

శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. స్పీకర్ పదవి కోసం ఇద్దరు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయడంతో రేపు (ఆదివారం) ఎన్నిక జరుగుతుంది. ఎమ్‌వీఏ కూటమిలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ ఉన్నాయి. నిజానికి గత ఫిబ్రవరి నుంచే స్పీకర్ పదవి ఖాళీగా ఉంది. కాంగ్రెస్ నుంచి స్పీకర్‌గా ఎన్నికైన నానా పటోల్‌కు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష పదవి రావడంతో, స్పీకర్ పదవికి రాజీనామా చేశారు

ట్రెండింగ్ వార్తలు