Forest Fire: ఎల్‌వోసీ వద్ద కార్చిచ్చు.. పేలుతున్న ల్యాండ్‌మైన్లు
నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వద్ద ఉన్న అటవీ ప్రాంతంలో సోమవారం అంటుకున్న కార్చిచ్చు, క్రమంగా భారత భూభాగంలోని మెందార్ సెక్టార్‌లోకి చొచ్చుకు వచ్చింది.
- Narender Thiru
- Published On : May 18, 2022 / 08:33 PM IST
Forest Fire
Forest Fire: నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వద్ద ఉన్న అటవీ ప్రాంతంలో సోమవారం అంటుకున్న కార్చిచ్చు, క్రమంగా భారత భూభాగంలోని మెందార్ సెక్టార్‌లోకి చొచ్చుకు వచ్చింది. ఈ కార్చిచ్చు ప్రభావంతో జమ్ము-కాశ్మీర్, పూంఛ్ జిల్లాలో ఉన్న ల్యాండ్‌మైన్లు పేలుతున్నాయని అధికారులు వెల్లడించారు. ఎల్‌వోసీ భారత సరిహద్దు ప్రాంతం కావడంతో, పాక్ వైపు నుంచి తీవ్రవాదుల చొరబాట్లు ఉండే అవకాశం ఉంది.
TRS Rajyasabha: టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థుల ఖరారు
దీంతో చొరబాట్లను నియంత్రించేందుకు ఈ ప్రాంతంలో సైనికులు ల్యాండ్‌మైన్లు ఏర్పాటు చేస్తుంటారు. అయితే, కార్చిచ్చు వల్ల చెలరేగిన మంటలతో ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ల్యాండ్‌మైన్లు పేలుతున్నాయి. మూడు రోజులుగా దాదాపు ఆరు ల్యాండ్‌మైన్లు పేలినట్లు అధికారులు తెలిపారు. ఈ మంటలను ఆర్పేందుకు ఆర్మీ, ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. బుధవారం ఉదయం మంటలు దాదాపు అదుపులోకి వచ్చినప్పటికీ, వేగంగా వీస్తున్న గాలుల ప్రభావంతో దరమ్‌శల్ ప్రాంతంలోకి కార్చిచ్చు వ్యాపించింది.
Rahul Gandhi: ఇండియాలోనూ శ్రీలంక పరిస్థితే: రాహుల్ గాంధీ
రాజౌరి జిల్లాలోని సుందర్ బండి, గంభిర్, నిక్కా, బ్రహ్మణ, మొఘల వంటి అనేక ప్రాంతాల్లో కూడా మంటలు అంటుకున్నాయి. వరుసగా అనేక ప్రాంతాలకు కార్చిచ్చు వ్యాపిస్తోంది. అయితే, మంటలు ఎంతగా చెలరేగుతున్నప్పటికీ, ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని అధికారులు తెలిపారు.
