GST Council Meeting: జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశం.. కోవిడ్ రాయితీలపై చర్చ!

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన 44వ జీఎస్‌టీ మండలి సమావేశం జరుగుతుంది. ఢిల్లీ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహిస్తున్న ఈ సమావేశంలో కొవిడ్‌-19 వ్యాక్సిన్‌, ఆక్సీజన్, ఆక్సీమీటర్లు, హాండ్‌ శానిటైర్లు, వెంటిలేటర్ల సహా..

GST Council Meeting: జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశం.. కోవిడ్ రాయితీలపై చర్చ!

Gst Council Meeting Discussion On Covid Equipments Concessions

Updated On : June 12, 2021 / 11:55 AM IST

GST Council Meeting: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన 44వ జీఎస్‌టీ మండలి సమావేశం జరుగుతుంది. ఢిల్లీ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహిస్తున్న ఈ సమావేశంలో కొవిడ్‌-19 వ్యాక్సిన్‌, ఆక్సీజన్, ఆక్సీమీటర్లు, హాండ్‌ శానిటైర్లు, వెంటిలేటర్ల సహా ఇతర పరికరాలు, బ్లాక్‌ ఫంగస్‌, అత్యవసర మందుల పన్ను రేట్ల తగ్గింపు, పన్ను రాయితీ అంశాన్ని మండలిలో చర్చిస్తున్నట్లు తెలుస్తుంది.

ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి బీఆర్కే భవన్ నుండి ఆర్థిక మంత్రి హరీశ్ రావు, సీఎస్ సోమేష్ కుమార్, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ నీతూ ప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు.

గత నెల 28న జరిగిన మండలి సమావేశంలో పన్ను మినహాయింపులు సామాన్యులకు చేరాలనే విషయమై బీజేపీ, ప్రతిపక్ష పార్టీల సీఎంల మధ్య వాగ్వాదం జరిగగా అప్పుడు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కరోనా వైద్యం, ఇతర పరికరాలపై పన్ను మినహాయింపు విషయమై మంత్రుల బృందం ఇప్పటికే నివేదిక సమర్పించగా నేడు చర్చ జరుగుతుంది.