Breaking: చైర్మన్గా నియమిచిన కాసేపటికే రాజీనామా చేసిన గులాం నబీ ఆజాద్
కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతల్లో ఒకరైన ఆజాద్.. చాలా కాలంగా కాంగ్రెస్ అదిష్టానం తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రాజ్యసభ పదవీ కాలాన్ని పొడగించకపోవడంతో పాటు బీజేపీ హిందుత్వ రాజకీయాల మూలంగా తనను పార్టీలో సైతం పక్కన పెట్టారనే అసంతృప్తి ఆయనకు ఉన్నట్లు తెలుస్తోంది. కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలకు చాలా దూరంగా ఉంటూ తన అసంతృప్తిని తెలియజేస్తూనే వస్తున్నారు

Gulam nabi Azad quits j and k congress committee hours after being appointed chairman
Breaking: జమ్మూ కశ్మీర్ రాష్ట్ర కాంగ్రెస్ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ పదవికి గులాం నబీ ఆజాద్ రాజీనామా చేశారు. ఆయనను జమ్మూ కశ్మీర్ కాంగ్రెస్ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్గా నియమిస్తున్నట్లు ప్రకటించిన గంటల వ్యవధిలోనే రాజీనామా చేయడం విశేషం. అలాగే జమ్మూ కశ్మీర్లోని రాజకీయ వ్యవహాలర కమిటీ సభ్యుడిగా కూడా ఉన్న ఈయన.. ఆ పదవికి కూడా రాజీనామా చేశారు.
కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతల్లో ఒకరైన ఆజాద్.. చాలా కాలంగా కాంగ్రెస్ అదిష్టానం తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రాజ్యసభ పదవీ కాలాన్ని పొడగించకపోవడంతో పాటు బీజేపీ హిందుత్వ రాజకీయాల మూలంగా తనను పార్టీలో సైతం పక్కన పెట్టారనే అసంతృప్తి ఆయనకు ఉన్నట్లు తెలుస్తోంది. కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలకు చాలా దూరంగా ఉంటూ తన అసంతృప్తిని తెలియజేస్తూనే వస్తున్నారు. ఈ తరుణంలో చాలా కాలం తర్వాత పార్టీ ఆయనకు పదవులు అప్పగించినప్పటికీ తన ఈసారి తన అసంతృప్తిని రాజీనామా ద్వారా తెలియజేయడం విశేషం.