Hareesh Shankar : తనికెళ్ళ భరణి ఇలా చెప్పారంటూ.. అనసూయ అందంపై స్టేజి మీదే హరీష్ శంకర్ కామెంట్స్..
స్టేజిమీద హరీష్ శంకర్ మాట్లాడుతూ.. ''ఇందాక అనసూయ ఏవి వచ్చింది. తనికెళ్ళ భరణి గారు ఆ ఏవి చూసి అనసూయాది అసూయ చెందే అందం అని నాతో అన్నారు. అదేదో స్టేజిమీదే చెప్పొచ్చు కదా అని నేను అంటే.......

Hareesh Shankar comments on Anasuya
Hareesh Shankar : యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టిన అనసూయ ఆ తర్వాత సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, స్పెషల్ సాంగ్స్ లో, స్పెషల్ క్యారెక్టర్స్, మెయిన్ లీడ్ గా దూసుకుపోతుంది. ఇప్పుడు అనసూయ సినిమాల్లో బిజీ అయిపోవడంతో ఏకంగా తనకి లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ నే వదిలేసింది. ప్రస్తుతం అనసూయ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇక ఏజ్ పెరుగుతున్న కొద్దీ అనసూయ అందం మరింత రెట్టింపు అవుతుంది. తన అందం చూపిస్తూ సినిమాల్లోనే కాక సోషల్ మీడియాలో ఫోటోషూట్స్ తో హల్ చల్ చేస్తుంది.
తాజాగా తాను నటించిన వాంటెడ్ పండుగాడ్ సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. రాఘవేంద్ర రావు సమర్పణలో చాలా మంది కమెడియన్స్ తో వాంటెడ్ పండుగాడ్ అని ఒక కామెడీ సినిమాగా తెరకెక్కించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం సాయంత్రం జరిగింది. ఈ ఈవెంట్ కి హరీష్ శంకర్ కూడా ఒక అతిధిగా వచ్చారు.
Prashanth Neel : తండ్రి జ్ఞాపకార్థం సొంతూరు ఆసుపత్రికి భారీ విరాళం ప్రకటించిన ప్రశాంత్ నీల్
స్టేజిమీద హరీష్ శంకర్ మాట్లాడుతూ.. ”ఇందాక అనసూయ ఏవి వచ్చింది. తనికెళ్ళ భరణి గారు ఆ ఏవి చూసి అనసూయాది అసూయ చెందే అందం అని నాతో అన్నారు. అదేదో స్టేజిమీదే చెప్పొచ్చు కదా అని నేను అంటే ఇలా లాల్చీ, పైజామా వేసుకొని భస్మం పెట్టుకొని శంకరా అనుకునే వాడ్ని నేను చెప్తే బాగోదు అన్నారు. నేను చెప్పనా అని అడిగితే ఓకే అన్నారు. తనికెళ్ళ భరణి గారి బదులు అనసూయ గురించి నేను చెప్పాను అందుకే” అని అన్నారు. దీంతో ఇలా అనసూయపై స్టేజిమీదే కామెంట్స్ చేయడంతో ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.