Supreme Court: నేడు సుప్రింకోర్టులో కీలక కేసులపై విచారణ .. అవేమిటంటే?

కాశ్మీరీ పండిట్ల ఊచకోతపై సిట్ విచారణను కోరుటూ 'రూట్స్ ఇన్ కాశ్మీర్' క్యూరేటివ్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టనుంది. రివ్యూ పిటిషన్‌ను 27ఏళ్లు ఆలస్యంగా దాఖలు చేశారనే కారణంతో 2017లో కొట్టివేసింది. మానవత్వానికి వ్యతిరేకంగా జరిగే నేరాల విషయంలో చర్యలు తీసుకోవడానికి కాలపరిమితి లేదని పిటిషన్‌లో పేర్కొంది. అదేవిధంగా ఎన్నికల సంఘం సభ్య కమిషనర్ల నియామకానికి సంబంధించిన నిబంధనలను రూపొందించే అంశంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.

Supreme Court: సుప్రీంకోర్టులో ఇవాళ కీలక కేసులపై విచారణ జరగనుంది. కాశ్మీరీ పండిట్ల ఊచకోతపై సిట్ విచారణకు పిటిషన్‌పై, ఎన్నికల సంఘం సభ్య కమిషనర్ల నియామకంపై అదేవిధంగా జల్లికట్టు రేసు విషయంలో, అక్రమ మత మార్పిడిపై కేంద్ర ప్రభుత్వం సమాధానం వంటి కేసులపై సుప్రింకోర్టులో మంగళవారం విచారణకు రానున్నాయి.

Supreme Court: బలవంతపు మత మార్పిడులతో జాతీయ భద్రతకు ముప్పు: సుప్రీంకోర్టు

కాశ్మీరీ పండిట్ల ఊచకోతపై సిట్ విచారణను కోరుటూ ‘రూట్స్ ఇన్ కాశ్మీర్’ క్యూరేటివ్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టనుంది. రివ్యూ పిటిషన్‌ను 27ఏళ్లు ఆలస్యంగా దాఖలు చేశారనే కారణంతో 2017లో కొట్టివేసింది. మానవత్వానికి వ్యతిరేకంగా జరిగే నేరాల విషయంలో చర్యలు తీసుకోవడానికి కాలపరిమితి లేదని పిటిషన్‌లో పేర్కొంది. అదేవిధంగా ఎన్నికల సంఘం సభ్య కమిషనర్ల నియామకానికి సంబంధించిన నిబంధనలను రూపొందించే అంశంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. అంతకుముందు విచారణ సందర్భంగా.. ఈ నియామకాలకు సంబంధించి పార్లమెంటు చట్టం చేసే వరకు మనం ఎందుకు మార్గదర్శకం జారీ చేయకూడదని జస్టిస్ కెఎం జోసెఫ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. దీనిపై ఇవాళ రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టనుంది.

Supreme Court: విద్వేషపూరిత ప్రసంగాలపై సుప్రీంకోర్టు సీరియస్… దేవుడిని ఏ స్థాయికి తగ్గించామంటూ వ్యాఖ్య

జల్లికట్టు, ఎద్దుల బండి పందేలకు అనుమతినిస్తూ తమిళనాడు, మహారాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే ఆ చట్టాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్లపైనా నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. సెప్టెంబర్ లో ఈ కేసు విచారణ సందర్భంగా జల్లికట్టు విషయంలో చేసిన సవరణలు రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ల తరపు న్యాయవాది పేర్కొన్నాడు. అదేవిధంగా అక్రమ మతమార్పిడి కేసులో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలకు సంబంధించి ఇవాళ సుప్రింకోర్టు విచారణకు జరగనుంది.

ట్రెండింగ్ వార్తలు