Supreme Court: బలవంతపు మత మార్పిడులతో జాతీయ భద్రతకు ముప్పు: సుప్రీంకోర్టు

దేశంలో పెరిగిపోతున్న బలవంతపు మత మార్పిడులపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. బలవంతపు మత మార్పిడుల వల్ల దేశ భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని కోర్టు వ్యాఖ్యానించింది.

Supreme Court: బలవంతపు మత మార్పిడులతో జాతీయ భద్రతకు ముప్పు: సుప్రీంకోర్టు

Supreme Court: బలవంతపు మత మార్పిడులతో జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని అభిప్రాయపడింది భారత సుప్రీం కోర్టు. బలవంతపు మత మార్పిడులపై కఠిన చర్యలు తీసుకునేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలివ్వాలంటూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

Sweety weds Sheru: స్వీటీ పెళ్లి షేరూతో.. సంప్రదాయబద్ధంగా పెంపుడు కుక్కల పెళ్లి

జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ హిమా కోహ్లీ ఆధ్వర్యంలోని సుప్రీం ధర్మాసనం సోమవారం దీనిపై విచారణ జరిపింది. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘బలవంతపు మత మార్పిడులు తీవ్రంగా పరిగణించాల్సిన అంశం. దీనివల్ల దేశ భద్రతకే కాకుండా మత స్వేచ్ఛ, నైతిక అంశాలకు కూడా ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. ఈ అంశం మరింత తీవ్రంగా మారకముందే కేంద్రం తన వైఖరి స్పష్టం చేయాల్సి ఉంది. ఇందుకు తగిన చర్యలు తీసుకోవాలి. ఎవరికైనా తమ మతాన్ని ఎంచుకునే హక్కు ఉంది. అయితే, బలవంతంగా మత మార్పిడి చేయడం సరికాదు’’ అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.

ఈ అంశంలో కేంద్రం తన వైఖరి ఏంటో స్పష్టం చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. దీనిపై ఈ నెల 22లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది. దీనిపై తదుపరి విచారణ ఈ నెల 28కి వాయిదా వేసింది.