Viral Video : ప్లాస్టిక్ బ్యాగ్ నుంచి ఆహారం తింటున్న జొమాటో డెలివరీ ఏజెంట్.. ఐఏఎస్ ఆఫీసర్ షేర్ చేసిన వీడియో వైరల్

నిత్యం లక్షలాదిమందికి వాళ్లు ఇంటికి తీసుకువచ్చి ఫుడ్ అందిస్తారు. కానీ వారు సరైన టైంలో.. మంచి ఆహారం తినే పరిస్థితుల్లో లేరు. ఓ ఫుడ్ డెలివరీ ఏజెంట్ ప్లాస్టిక్ బ్యాగ్‌లో ఫుడ్ తింటున్న వీడియో నెటిజన్ల మనసును కదిలించింది.

Viral Video

Viral Video : నిత్యం వందలాదిమందికి వారు ఫుడ్ డెలివరీ చేస్తారు. విధుల్లో ఉంటూ తాము సమయానికి ఆహారం తీసుకునే టైం ఉండదు. ఓ డెలివరీ ఏజెంట్ ప్లాస్టిక్ బ్యాగ్‌లో ఆహారం తింటున్న వీడియో ఐఏఎస్ ఆఫీసర్ అవనీష్ శరణ్ షేర్ చేయడంతో వైరల్ అవుతోంది.

Bengaluru : ఫుడ్ డెలివరీ ఏజెంట్‌పై 8 ఏళ్ల బాలిక తప్పుడు ఫిర్యాదు .. ఏజెంట్‌ను చితక్కొట్టిన అపార్ట్ మెంట్‌వాసులు

ఫుడ్ డెలివరీ ఏజెంట్లు రోజు లక్షలాది మందికి ఫుడ్ డెలివరీ చేస్తుంటారు. వీరిలో కొందరికి ఆహారం తినే టైం ఉండదు. కొందరికి ఫుడ్ తినడానికి కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో ఉన్నారనే వార్తలు చదివాం. తాజాగా జొమాటో డెలివరీ ఏజెంట్  డ్యూటీకి వెళ్లే హడావిడిలో తన బైక్ మీద ప్లాస్టిక్ బ్యాగ్‌లో ఆహారం తింటున్న వీడియో వైరల్ అవుతోంది. అవనీష్ శరణ్ (Awanish Sharan) అనే ఐఏఎస్ అధికారి షేర్ చేసిన ఈ వీడియో చాలామందిని కదిలించింది. ‘ఈ సీజన్‌లో వారిని కూడా జాగ్రత్తగా చూసుకోండి’ అనే శీర్షికతో ఆయన షేర్ చేసిన వీడియోపై చాలామంది నెటిజన్లు స్పందించారు.

Swiggy delivery boy story : తిండి లేదు.. బైక్ లేదు.. ఫుడ్ డెలివరీ కోసం కిలోమీటర్లు నడిచాడు.. నెటిజన్ల సాయంతో జాబ్ సంపాదించుకున్నాడు

‘ఇలాంటి వీడియోలు చూస్తుంటే హృదయ విదారకంగా ఉంది’ అని ఒకరు.. ‘మన కుటుంబం మరియు ప్రియమైన వారి కోసం ఆహారం అందించే ఇలాంటి వారు నిజంగా సూపర్ స్టార్లు’ అంటూ మరొకరు వరుసగా ట్వీట్ చేశారు. గతంలో జొమాటో డెలివరీ బోయ్ ఆకలి తట్టుకోలేక కస్టమర్ ఆర్డర్ నుంచి ఆహారం తిన్న వీడియో వైరల్ అయింది. ఆ సందర్భంలో జొమాటో ఏజెంట్‌పై చర్యలు కూడా తీసుకుంది. తమ కస్టమర్లకు సురక్షితమైన ఆహారం ఇవ్వడానికి కట్టుబడి ఉన్నామంటూ అప్పట్లో ప్రకటన చేసింది.