Snapchat New Version : స్నాప్‌చాట్ కొత్త PWA వెబ్ వెర్షన్ వచ్చేసిందోచ్.. ఇకపై విండోస్‌లోనూ వాడొచ్చు.. యాప్ ఎలా డౌన్‌లోడ్ చేయాలంటే?
Snapchat New Version : ప్రముఖ ఫొటో, మెసేజ్ షేరింగ్ యాప్ స్నాప్‌చాట్ (Snapchat) యూజర్లకు అలర్ట్.. స్నాప్‌చాట్ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ విండోస్‌లో అందుబాటుకి వచ్చింది. ఇప్పటికే ఈ స్నాప్‌చాట్ సర్వీసులు మొబైల్ వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
Here's how to download Snapchat on Windows, Follow these Steps
Snapchat New Version : ప్రముఖ ఫొటో, మెసేజ్ షేరింగ్ యాప్ స్నాప్‌చాట్ (Snapchat) యూజర్లకు అలర్ట్.. స్నాప్‌చాట్ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ విండోస్‌లో అందుబాటుకి వచ్చింది. ఇప్పటికే ఈ స్నాప్‌చాట్ సర్వీసులు మొబైల్ వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. లేటెస్టుగా Windows ప్లాట్‌ఫారమ్‌పై కూడా అందుబాటులోకి వచ్చేశాయి. అది కూడా యాప్ వెబ్ వెర్షన్ మాత్రమే.. సోషల్ మీడియా మైక్రోసాఫ్ట్ స్టోర్‌లో ప్రోగ్రెసివ్ వెబ్ యాప్ పేరుతో స్నాప్‌చాట్ లాంచ్ అయింది.
విండోస్ సెంట్రల్ నుంచి వచ్చిన నివేదిక ప్రకారం.. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ప్రోగ్రెసివ్ వెబ్ యాప్ (PWA) Windows 10, 11 పర్సనల్ కంప్యూటర్‌లలో (Microsoft Edge) ద్వారా రన్ అవుతుంది. ఈ యాప్ Snap వెబ్ వెర్షన్‌పై ఆధారపడి పనిచేస్తుంది.
ఈ ఏడాది ప్రారంభంలో కొత్త స్నాప్‌చాట్ PWA యాప్‌గా రిలీజ్ అయింది. మైక్రోసాఫ్ట్ క్రోమియం ఆధారిత మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ద్వారా పనిచేస్తుందని ఓ నివేదిక తెలిపింది. ఇంతకీ విండోస్‌లో స్నాప్‌చాట్‌ని ఎలా డౌన్‌లోడ్ చేయాలో తెలుసా? అయితే ఈ కింది విధంగా ఫాలో అవ్వండి.

Here’s how to download Snapchat on Windows, Follow these Steps
Read Also : WhatsApp Tips : మీ వాట్సాప్‌లో మెసేజ్ రియాక్షన్ నోటిఫికేషన్లను ఎలా డిసేబుల్ చేయాలో తెలుసా?
* కంప్యూటర్ స్క్రీన్ దిగువన ఉన్న విండోస్ ఐకాన్‌పై Click చేయండి.
* మైక్రోసాఫ్ట్ స్టోర్ కోసం సెర్చ్ చేసి అందులో Windows ఓపెన్ చేయండి.
* ఇప్పుడు సెర్చ్ బార్‌లో Snapchat యాప్‌ని సెర్చ్ చేయండి.
* గెట్ ఇట్ ఇన్ స్టోర్ యాప్‌పై క్లిక్ చేయండి (స్టోర్ యాప్‌కి రిడైరెక్ట్ అవుతుంది).
* ఇప్పుడు చివరగా గెట్ ఆప్షన్ Click చేయండి.
* అంతే.. Snapchat యాప్ ఇన్‌స్టాల్ అయిపోతుంది.
ఈ Snapchat యాప్ ఫైల్ సైజు 1.4 MP ఇన్‌స్టాలేషన్ మాత్రమే కలిగి ఉంది. Snap ఎల్లప్పుడూ లేటెస్ట్ అప్‌డేట్స్ ఉంటాయి. వెబ్ వెర్షన్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. అంతేకాకుండా, ఈ యాప్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ (Microsoft Edge) ద్వారా పని చేస్తుంది. విండోస్ యాప్‌ని సాధారణ యాప్‌లాగా వినియోగించుకోవచ్చు.
విండోస్ స్టార్ట్ మెనూ (Start Menu)లో ఐకాన్, నోటిఫికేషన్ అలర్ట్, మరిన్ని ఫీచర్లతో వస్తుందని నివేదిక సూచిస్తుంది. స్నాప్‌చాట్ యూజర్లు ఉచితంగా ఏమీ చెల్లించకుండానే మైక్రోసాఫ్ట్ స్టోర్ నుంచి ఈ స్నాప్‌చాట్ PWA వెర్షన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
మరోవైపు.. Snapchat తమ యూజర్ల కోసం ఆగ్మెంటెడ్ రియాలిటీ ట్రై-ఆన్ ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు అమెజాన్‌తో భాగస్వామ్యం కలిగి ఉంది. Snap 363 మిలియన్ల రోజువారీ యాక్టివ్ యూజర్లకు అందుబాటులో ఉన్న Persol, Maui Jim, Oakley, Ray-Ban, Costa Del Mar సహకారంతో వర్చువల్ ట్రై-ఆన్ ప్రొడక్టులను అందిస్తుంది.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..
