WhatsApp Tips : మీ వాట్సాప్‌లో మెసేజ్ రియాక్షన్ నోటిఫికేషన్లను ఎలా డిసేబుల్ చేయాలో తెలుసా?

WhatsApp Tips : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) ఈ ఏడాది ప్రారంభంలో iOS, Android, వెబ్ వెర్షన్ (Web Version) కోసం మెసేజ్ రియాక్షన్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ఇన్‌స్టాగ్రామ్ (Instagram), ఫేస్‌బుక్‌ (Facebook)లలో ఉండే రియాక్షన్ ఫీచర్‌ను పోలి ఉంటుంది.

WhatsApp Tips : మీ వాట్సాప్‌లో మెసేజ్ రియాక్షన్ నోటిఫికేషన్లను ఎలా డిసేబుల్ చేయాలో తెలుసా?

WhatsApp Tips _ How to disable message reaction notifications

WhatsApp Tips : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) ఈ ఏడాది ప్రారంభంలో iOS, Android, వెబ్ వెర్షన్ (Web Version) కోసం మెసేజ్ రియాక్షన్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ఇన్‌స్టాగ్రామ్ (Instagram), ఫేస్‌బుక్‌ (Facebook)లలో ఉండే రియాక్షన్ ఫీచర్‌ను పోలి ఉంటుంది. వాట్సాప్ యూజర్లు ఎమోజీతో వ్యక్తిగత లేదా గ్రూప్ చాట్‌లలో మెసేజ్‌లకు రియాక్షన్ పంపవచ్చు. వర్చువల్ కీబోర్డ్‌లో అందుబాటులో ఉన్న ఎమోజీలను ఉపయోగించి యూజర్లు ఏదైనా మెసేజ్‌కు రియాక్షన్ పంపుకోవచ్చు. వాట్సాప్ మెసేజ్ రియాక్షన్ ఫీచర్ (Reaction Feature) ఏదైనా నిర్దిష్ట మెసేజ్‌కి రిప్లే లేదా రియాక్షన్ పంపేందుకు సాయపడుతుంది.

మీరు ఎమోజీతో మెసేజ్‌కు రియాక్షన్ పంపినప్పుడు WhatsApp మీ కాంటాక్టులకు రియాక్షన్ నోటిఫికేషన్‌ను కూడా పంపుతుంది. కానీ, కొన్నిసార్లు మెసేజ్ రియాక్షన్ నోటిఫికేషన్‌లు తరచుగా మెసేజ్ నోటిఫికేషన్‌గా పంపుకోవచ్చు. గ్రూప్ చాట్‌లో ఎక్కువ మంది యూజర్లు మీ మెసేజ్‌లకు రియాక్షన్ పంపితే.. మీకు కొన్నిసార్లు చికాకు కలిగించవచ్చు.

అందుకే యూజర్లకు ఈ సమస్యకు నుంచి పరిష్కారాన్ని కూడా అందిస్తుంది. మెసేజ్ రియాక్షన్ నోటిఫికేషన్‌లను డిసేబుల్ చేయడానికి వాట్సాప్ యూజర్లను అనుమతిస్తుంది. మెసేజ్ రియాక్షన్ నోటిఫికేషన్‌ను ఎలా డిసేబుల్ చేయాలో ఇప్పుడు చూద్దాం.

WhatsApp మెసేజ్ రియాక్షన్ నోటిఫికేషన్‌లను ఎలా డిసేబల్ చేయాలంటే :

* మీ iOS, Android ఫోన్ లేదా డెస్క్‌టాప్‌లో WhatsApp ఓపెన్ చేయండి.
* టాప్ రైట్ కార్నర్‌లో అందుబాటులో ఉన్న త్రి డాట్స్ మెనుపై Tap చేయండి. Settings ఆప్షన్ ఎంచుకోండి.
* ఆ తర్వాత, ఆప్షన్ల నుంచి నోటిఫికేషన్‌ల ట్యాబ్‌ను Tap చేయాలి. ఆపై Open బటన్ Click చేయండి.
* స్క్రోల్ చేసి.. రియాక్షన్ నోటిఫికేషన్ ఆప్షన్ కనుగొనండి.
* మీరు పంపే మెసేజ్‌లకు రియాక్షన్ పంపే Show Notification’ని టోగుల్ చేసి, Turn Off చేయండి.

WhatsApp Tips _ How to disable message reaction notifications

WhatsApp Tips _ How to disable message reaction notifications

ముఖ్యంగా, వాట్సాప్ వ్యక్తిగత చాట్‌లు, గ్రూప్ చాట్‌ల కోసం మెసేజ్ రియాక్షన్ నోటిఫికేషన్‌ను ఆఫ్ చేసేందుకు స్పెషల్ ఆప్షన్లను అందిస్తుంది. ‘Messages’, ‘Groups’ ఆప్షన్‌ల కింద రియాక్షన్ నోటిఫికేషన్ ఆప్షన్‌ను Off చేయండి. ఇంతలో, వాట్సాప్ గ్రూప్ చాట్ ఫీచర్‌లో View Profile Photo రిలీజ్ చేయడం ప్రారంభించింది.

Read Also : WhatsApp Self Chat : వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఇకపై మీకు మీరే మెసేజ్ పంపుకోవచ్చు.. ఇదిగో ప్రాసెస్..!

WhatsApp వెబ్ బీటా (Web Beta) టెస్టర్ల కోసం ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. ఎంపిక చేసిన WhatsApp iOS బీటా టెస్టర్లకు కూడా ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. వాట్సాప్ ఆటో-చాట్ ఫీచర్‌ను రిలీజ్ చేసింది. కొత్త ఫీచర్ వల్ల యూజర్లు తమ వాట్సాప్‌లో Notes, Reminders, షాపింగ్ లిస్ట్‌లను తమకు తాము పంపుకోవచ్చు. ఈ ఫీచర్ రాబోయే వారాల్లో ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లకు అందుబాటులో ఉంటుంది.

Android లేదా iOS మొబైల్‌లో WhatsApp ఓపెన్ చేయండి.
* కాంటాక్టుల లిస్టును ఓపెన్ చేయండి.
* మీరు కాంటాక్టుల లిస్టు ఎగువన మీ సొంత కాంటాక్టును కనుగొంటారు.
* మీ కాంటాక్టును నొక్కండి.
* మీరు ఆటో-చాట్ స్క్రీన్‌కు నావిగేట్ అవుతారు.
* ఇక్కడ మీరు మీకు మెసేజ్‌లను పంపుకోవచ్చు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : WhatsApp Users Data : డార్క్ వెబ్‌లో వాట్సాప్ యూజర్ల డేటా సేల్.. 50 కోట్ల మంది ఫోన్ నెంబర్లు లీక్.. మీ డేటా లీక్ అయిందో లేదో ఇలా చెక్ చేసుకోండి!