T20 World Cup 2026: భారత టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చిన అమెరికా
బ్యాటింగ్ మొదలు పెట్టిన వెంటనే అభిషేక్ శర్మ డకౌట్ అయ్యాడు. ఇషాన్ కిషన్ 20, తిలక్ వర్మ 25 పరుగులకే ఔటయ్యారు.
Ali Khan (Image Credit To Original Source)
- ముంబైలోని వాంఖడే స్టేడియంలో మ్యాచ్
- 3 వికెట్లు తీసిన షాడ్లీ ఆఫ్ షాల్క్విక్
- 46 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఇండియా
India vs USA: ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచ కప్-2026 3వ మ్యాచ్‌లో భాగంగా భారత్, అమెరికా మధ్య మ్యాచ్ జరుగుతోంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచులో టాస్ గెలిచిన అమెరికా బౌలింగ్ ఎంచుకుంటుంది. భారత టాప్ ఆర్డర్ 46 పరుగులకే కుప్పకూలింది.
బ్యాటింగ్ మొదలు పెట్టిన వెంటనే అభిషేక్ శర్మ డకౌట్ అయ్యాడు. అలీ ఖాన్ బౌలింగ్‌లో సంజయ్ కృష్ణమూర్తికి క్యాచ్ ఇచ్చుకుని వెనుదిరిగాడు. ఇషాన్ కిషన్ 20, తిలక్ వర్మ 25 పరుగులకే ఔటయ్యారు.
Also Read: వాటి గురించి రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదు?: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
ఆ తర్వాత వచ్చిన శివం దుబే కూడా డకౌట్‌గా వెనుదిరిగాడు. భారత స్కోరు 6 ఓవర్ల నాటికి 4 వికెట్ల నష్టానికి 46గా ఉంది. 6 ఓవర్ల నాటికి అమెరికా బౌలర్లలో షాడ్లీ షాల్క్విక్ 3, అలీ ఖాన్ ఒక వికెట్ తీశారు.
భారత జట్టు: ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, అర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్
అమెరికా జట్టు: ఆండ్రీస్ గౌస్ (వికెట్ కీపర్), సైతేజ ముక్కమల్ల, మోనాంక్ పటేల్ (కెప్టెన్), మిలింద్ కుమార్, సంజయ్ కృష్ణమూర్తి, శుభమ్ రంజనే,హర్మీత్ సింగ్,మహమ్మద్ మొహ్సిన్, షాడ్లీ వాన్ స్కాల్క్విక్, అలీ ఖాన్, సౌరభ్ నేత్రావల్కర్
