Hombale Films Next Project With Sudha Kongara
Hombale Films: కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ‘కేజీయఫ్ చాప్టర్ 2’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో మనందరికీ తెలుసు. ఈ సినిమాతో రాకింగ్ స్టార్ యశ్, ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ఔట్ అండ్ ఔట్ పక్కా కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఇక భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను హొంబాలే ఫిలింస్ ప్రొడ్యూస్ చేయగా, బాక్సాఫీస్ వద్ద కేజీయఫ్2 కాసుల వర్షం కురిపిస్తోంది.
KGF2: కేజీఎఫ్ విక్టరీ వెనుక ఆ ముగ్గురు.. అసలెలా పట్టుకున్నారు?
అయితే ఈ సినిమాతో భారీ లాభాలను అందుకోబోతున్న హొంబాలే ఫిలింస్ తమ నెక్ట్స్ ప్రాజెక్టును కూడా ప్రశాంత్ నీల్‌తో కలిసే చేస్తున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అందాల భామ శృతి హాసన్ హీరోయిన్‌గా ‘సలార్’ అనే మరో యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీని తెరకెక్కిస్తోంది చిత్ర యూనిట్. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా తరువాత తమ నెక్ట్స్ ప్రాజెక్టును తాజాగా హొంబాలే ఫిలింస్ అనౌన్స్ చేసింది. ‘గురు’, ‘ఆకాశమే నీ హద్దురా వంటి’ సినిమాలతో అదిరిపోయే గుర్తింపును తెచ్చుకున్న లేడీ డైరెక్టర్ సుధా కొంగరతో ఓ ప్రెస్టీజియస్ ప్రాజెక్టును చేసేందుకు హొంబాలే ఫిలింస్ రెడీ అయ్యింది.
Sudha Kongara: లేడీ డైరెక్టర్‌తో మహేష్.. ఒకే చెప్పినట్లేనా?
ఈ మేరకు ఓ అనౌన్స్‌మెంట్ కూడా చేసింది సదరు బ్యానర్. ‘‘కొన్ని యధార్థ ఘటనలను ఖచ్చితంగా తెలుసుకోవాలి.. ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవాలి’’ అంటూ హొంబాలే ఫిలింస్ తమ కొత్త ప్రాజెక్టును వెల్లడించింది. ఇక ఈ సినిమాలోని నటీనటులు ఎవరనే విషయంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఈ ప్రాజెక్టును త్వరలోనే పట్టాలెక్కించబోతున్నట్లు చిత్ర నిర్మాతలు పేర్కొన్నారు. అయితే గతంలో ‘ఆకాశమే నీ హద్దురా’ సినిమా తరువాత హీరో సూర్యతో సుధా కొంగర మరో సినిమా చేయాలని ప్లాన్ చేశారు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అదే అయ్యి ఉంటుందని సినీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.
???? ???? ??????? ??????? ?? ?? ????, ??? ???? ?????.
To a new beginning with a riveting story @Sudha_Kongara, based on true events.@VKiragandur @hombalefilms @HombaleGroup pic.twitter.com/mFwiGOEZ0K
— Hombale Films (@hombalefilms) April 21, 2022