Indian Railway :పాపాయి కోసం పాలు కావాలని మంత్రికి తల్లి ట్వీట్..23 నిమిషాల్లో బిడ్డ ఆకలి తీర్చిన రైల్వే శాఖ

ఆకలితో గుక్కపల్లి ఏడుస్తున్న బిడ్డ కోసం పాలు కావాలని ఓ తల్లి రైల్వేశాఖ మంత్రికి ట్వీట్‌ చేసింది. వెంటనే స్పందించిన మంత్రి 23 నిమిషాల్లోనే పాలు అందేలా చేసి బిడ్డ ఆకలి తీర్చారు.

mother tweeted to the railway minister after 23 minutes milk : చంటిబిడ్డలతో రైలు ప్రయాణం చేసేటప్పుడు వారికి ఎటువంటి ఇబ్బంది రాకుండా తల్లులు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అయినా కొన్ని సమయాల్లో ఇబ్బందులు తప్పవు.అలా రైలులో ప్రయాణం చేసే ఓ తల్లికి అటువంటి ఇబ్బందే వచ్చింది. చంటిబిడ్డ పాల కోసం ఏడుస్తోంది. కానీ ఆ బిడ్డ ఆకలి తీర్చేలేని పరిస్థితుల్లో తల్లి ఉంది. దీంతో ఆమె గుక్కపట్టి ఏడుస్తున్న బిడ్డ కోసం పాలు కావాలని రైల్వేశాఖ మంత్రికి ట్వీట్‌ చేసింది. ఆమె విన్నపాన్ని మంత్రి లైట్ తీసుకోలేదు.వెంటనే స్పందించారు. తగిన ఏర్పాట్లు చేయాలని బిడ్డ ఆకలి తీర్చేలా ఏర్పాట్లు చేశారు. అంతే కేవలం 23 నిమిషాల్లోనే ఆకలితో ఏడ్చే చంటిబిడ్డ ఆకలి తీర్చింది రైల్వే శాఖ.

Also read : Earthquake : అరుణాచల్‌ ప్రదేశ్‌లో మరోసారి భూకంపం..రిక్టర్‌ స్కేల్‌పై 4.9 తీవ్రత నమోదు

ఉత్తరప్రదేశ్ లోని సుల్తాన్‌పూర్‌కు చెందిన అంజలీ తివారీ అనే మహిళ లోకమాన్య తిలక్‌ టెర్మినల్‌ నుంచి ఎల్‌టీటీ (12143) ట్రైన్‌ ఏసీ 3కోచ్‌లో ప్రయాణిస్తోంది. రైలు మధ్యాహ్నం 2.30 గంటలకు భీమ్‌సేన్ స్టేషన్‌కు చేరుతుండగా..ఆమె ఎనిమిది నెలల చంటిపాప ఆకలితో ఏడవడం ప్రారంభించింది. తల్లి ఎంత సముదాయించినా ఏడుపు ఆపలేదు. ఆకలితో ఉన్న చంటిబిడ్డకు ఏం తెలుస్తుంది. ఆకలేస్తే ఏడవటం..బుజ్జి బొజ్జ నిండాక హాయిగా పడుకోవటం తప్ప. బిడ్డ ఆకలితో ఏడుస్తుంటే అంజలికి ఆమె కుటుంబ సభ్యులకు ఏం చేయాలో తెలియలేదు. దీంతో ‘పాప ఏడుస్తోందని.. పాలు కావాలంటూ’ 2.52 గంటలకు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు ట్వీట్‌ చేసింది.

వెంటనే స్పందించిన మంత్రి పాపకు పాలు అందించేందుకు ఏర్పాటు చేయాలని రైల్వే సిబ్బందికి ఆదేశించారు. ట్వీట్‌ చేసిన సమయానికి అప్పటికే రైలు భీమ్‌సేన్‌ స్టేషన్‌ నుంచి బయలుదేరింది. ట్వీట్‌ చేసిన 23 నిమిషాల కాన్పూర్‌ సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌లోని 9వ నంబర్ ఫ్లాట్‌ఫాంపైకి రైలు 15.15 గంటలకు చేరిన వెంటనే అప్పటికే పాలు పట్టుకుని ఎదురు చూస్తునన రైల్వే సిబ్బంది తల్లికి పాలు అందించారు.

Also read : Asteroid:భూ కక్ష్యను దాటుకుంటూ వెళ్లనున్న భారీ గ్రహశకలం

కాన్పూర్‌ డిప్యూటీ సీటీఎం హిమాన్షు శేఖర్‌ ఉపాధ్యాయ ఆదేశాల మేరకు ఏసీఎం సంతోష్ త్రిపాఠి చిన్నారికి పాలు అందించేందుకు ఏర్పాట్లు చేశారు. తన ట్వీట్ కు వెంటనే స్పందించి తన బిడ్డ ఆకలి తీర్చిన రైల్వేశాఖకు అంజలి కృత్ఞతలు తెలిపింది. ఆ తర్వాత రైలు కాన్పూర్‌ నుంచి సుల్తాన్‌పూర్‌కు ఎనిమిది నిమిషాలు ఆలస్యంగా బయలుదేరింది.

 

ట్రెండింగ్ వార్తలు