Earthquake : అరుణాచల్‌ ప్రదేశ్‌లో మరోసారి భూకంపం..రిక్టర్‌ స్కేల్‌పై 4.9 తీవ్రత నమోదు

అరుణాచల్‌ ప్రదేశ్‌లోని ఈరోజు తెల్లవారు ఝామున భూకంపం సంభవించింది. బాసర్‌లో ఈరోజు తెల్లవారు జామున 4.29 గంటలకు 4.9 తీవ్రతతో భూకంపం సంభవించింది.

Earthquake : అరుణాచల్‌ ప్రదేశ్‌లో మరోసారి భూకంపం..రిక్టర్‌ స్కేల్‌పై 4.9 తీవ్రత నమోదు

Earthquake Strikes Arunachal Pradesh

Earthquake Strikes Arunachal Pradesh : అరుణాచల్‌ ప్రదేశ్‌లోని ఈరోజు తెల్లవారు ఝామున భూకంపం సంభవించింది. బాసర్‌లో మంగళవారం (జనవరి 18,2022) తెల్లవారు జామున 4.29 గంటలకు భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై 4.9 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ (NCS) పేర్కొంది.

బాసర్‌కు ఉత్తర వాయువ్య దిశలో 148 కిలోమీటర్ల దూరంలో, భూమికి పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించినట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ పేర్కొంది. వేకువ జామున ఒక్కసారిగా భూమి కంపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. నిద్రలో ఉండగా సంభవించిన భూకంపం ధాటికి ఏం జరిగిందో తెలియక అయోమయానికి గురయ్యారు.

దీంతో ఇళ్లనుంచి నుంచి పరుగులు పెట్టారు. హిమాలయాల్లో ఒదిగినట్టుండే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని తరచు  భూకంపాలు భయకంపితులను చేస్తున్నాయి. అక్టోబర్ 2న పాంగిన్‌లోనే 4.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. తర్వాత అక్టోబర్ 3న బాసర్‌లో 4.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. అక్టోబర్ 5న మరోసారి పాంగిన్‌లో మళ్లీ 4.5 తీవ్రతతో భూకంపం నమోదైంది.

భూకంపం సంభవిస్తే తీసుకోవల్సిన జాగ్రత్తలు..
ఇంట్లో ఉంటే కచ్చితంగా బయటకు రావాలి..
బయటకు వచ్చిన తర్వాత భవనాలు, చెట్లు, స్తంభాలు మరియు వైర్‌లకు దూరంగా ఉండాలి.
వాహనంలో ప్రయాణిస్తుంటే, వీలైనంత త్వరగా వాహనాన్ని ఆపి సురక్షిత ప్రాంతంలో ఉండాలి..
ఆ సమయంలో అగ్గిపుల్ల వెలిగించవద్దు.. శబ్దం చేయరాదు…

భూకంపం ఎందుకు వస్తుంది?
భూమి ప్రధానంగా నాలుగు పొరలతో రూపొందించబడింది. సాలిడ్ కోర్, లిక్విడ్ కోర్, మాంటిల్ మరియు క్రస్ట్. క్రస్ట్‌కు సంబంధించిన ఎగువ మాంటిల్ కోర్‌ను లిథోస్పియర్ అంటారు. ఈ 50 కి.మీ మందపాటి పొర అనేక విభాగాలుగా విభజించబడింది. వీటిని టెక్టోనిక్ ప్లేట్లు అంటారు. ఈ టెక్టోనిక్ ప్లేట్లు వాటి స్థానాల్లో కదులుతూ ఉంటాయి. ఈ ప్లేట్ ఎక్కువగా కదలడం ప్రారంభించినప్పుడు భూకంపం సంభవిస్తుంది. ఈ ప్లేట్లు వాటి ప్రదేశం నుండి అడ్డంగా మరియు నిలువుగా కదులుతూ ఉంటాయి. భూకంప తీవ్రత భూకంప కేంద్రం నుంచి వెలువడే శక్తి తరంగాల ద్వారా అంచనా వేస్తారు.