Covid update : దేశంలో కొత్తగా 1,270 కోవిడ్ కేసులు

దేశంలో కోవిడ్ కేసులు సంఖ్య తగ్గుముఖం పట్టింది. నిన్న కొత్తగా 1,270 కోవిడ్ కేసులు నమోదుకాగా... 31 మరణాలు సంభవించాయి.ప్రస్తుతం దేశంలో 15,859 యక్టీవ్ కేసులుఉన్నాయని కేంద్ర వైద్య

India Covid

Covid update :   దేశంలో కోవిడ్ కేసులు సంఖ్య తగ్గుముఖం పట్టింది. నిన్న కొత్తగా 1,270 కోవిడ్ కేసులు నమోదుకాగా… 31 మరణాలు సంభవించాయి.ప్రస్తుతం దేశంలో 15,859 యక్టీవ్ కేసులుఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఈరోజు విడుదల చేసిన హెల్త్  బులెటిన్ లో తెలిపింది. దేశంలో   యాక్టివ్ కేసులు 0.04 శాతంగా ఉన్నాయి.

దేశంలో ఇప్పటివరకు 4,30,20,723 కోవిడ్ కేసులు నమోదు కాగా, వీరిలో 5,21,035మంది కోవిడ్ తదితర కారణాలతో మరణించారు. దేశంలో కరోన రికవరీ రేటు 98.75 శాతంగా ఉంది.  నిన్న కరోనా నుంచి 1, 567 మంది   కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోవిడ్ నుంచి కోలుకున్నవారి సంఖ్య 4,24,83,829కి చేరింది.

మరో వైపు కోవిడ్ నియంత్రణకోసం చేపట్టిన వ్యాక్సినేషన్ ప్రక్రియ 437 రోజులుగా భారత్ లో విజయవంతంగా కొనసాగుతోంది. దేశంలో ఇప్పటివరకు 183,26,35,673 డోసుల టీకాలు వేశారు, నిన్న ఒక్కరోజు 4,20,842 డోసుల టీకాలు వేశారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో పేర్కోంది.

Also Read : Genetic Mosquitoes : రోగకారక దోమల పనిపట్టేందుకు జన్యుమార్పిడి దోమలు..!