Genetic Mosquitoes : రోగకారక దోమల పనిపట్టేందుకు జన్యుమార్పిడి దోమలు..!
Genetic Mosquitoes : రోగాలను వ్యాప్తిచేసే దోమలను నిర్మూలించేందుకు అమెరికాలో చేపట్టిన వినూత్న ప్రయోగం విజయవంతమైంది. ఆక్సిటెక్ అనే సంస్థ దోమల జన్యుమార్పిడిపై ఓ ప్రయోగం చేసింది.

Genetic Mosquitoes Millions Of Genetically Engineered Mosquitoes Are Here To Protect Us
Genetic Mosquitoes : రోగాలను వ్యాప్తిచేసే దోమలను నిర్మూలించేందుకు అమెరికాలో చేపట్టిన వినూత్న ప్రయోగం విజయవంతమైంది. సాధారణంగా మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులను వ్యాప్తిచేసే దోమలు జాతులు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ దోమల బెడద కారణంగా అనేక ప్రాణాంతక వ్యాధులు ప్రబలుతున్నాయి. ఈ దోమల వ్యాప్తిని అరికట్టేందుకు అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే దోమలను దోమలతోనే అంతం చేసేందుకు యూకేకు చెందిన ఆక్సిటెక్ అనే సంస్థ దోమల జన్యుమార్పిడిపై ఓ ప్రయోగం చేసింది. ఇప్పుడా ఆ ప్రయోగంలో సక్సెస్ అయింది. ఈ జన్యుమార్పిడి దోమలను రోగకారక దోమలపైకి వదులుతారు. ఈ జెనటిక్ దోమలు.. రోగకారక దోమలతో కలవడం ద్వారా రోగకారక దోమలు చనిపోతాయని గుర్తించారు. జన్యు మార్పిడి దోమలను గాల్లోకి వదలడం ద్వారా భవిష్యత్తులో రోగకారక దోమల వ్యాప్తి పూర్తిగా అంతరించిపోయేలా చేయొచ్చునని సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు.
ఈడెస్ ఈజిప్టి (Aedes aegypti) వంటి దోమ జాతుల సంఖ్య కార్గోలో కాలిఫోర్నియాలో ఎక్కువగా పెరిగిపోయింది. వెచ్చని వాతావరణంలో ఈ జాతులు లాస్ ఏంజెల్స్ కౌంటీ వంటి ప్రదేశాల్లో ఎక్కువగా విజృంభిస్తున్నాయి. వాతావరణం నిరంతరం వేడెక్కుతున్నందున ఈ సమశీతోష్ణ ప్రాంతాలలో దోమల వ్యాప్తి అధికంగా ఉంటుందని సైంటిస్టులు అంటున్నారు. ఈ రకం జాతులు ఇప్పటికే గల్ఫ్ రాష్ట్రాల్లో శతాబ్దాలుగా వృద్ధి చెందాయి. ఈడెస్ ఈజిప్టి దోమలు రోగకారకాలుగా మారుతున్నాయి. ఈ దోమల వల్ల డెంగ్యూ జ్వరం, ఇతర ఫ్లూ, జికా వంటి వైరల్ వ్యాధులను వ్యాప్తి చేస్తాయి.
అమెరికాలోని చాలా ప్రదేశాల్లో ఈ దోమల బెడద అధికంగా ఉంది. భవిష్యత్తులో వీటి వ్యాప్తి ప్రమాదకర స్థాయికి పెరిగే అవకాశం ఉందని సైంటిస్టులు ముందుగానే హెచ్చరిస్తున్నారు. ఈ దోమల వ్యాప్తిని అరికట్టేందుకు జన్యుపరమైన దోమలను రంగంలోకి దింపడానికి అమెరికా పర్యావరణ పరిరక్షణ సంస్థ (ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) కూడా అనుమతినిచ్చింది. ఇటీవలి సంవత్సరాల్లో కాలిఫోర్నియా ఫ్లోరిడాలో 2.4 మిలియన్లకు పైగా జన్యుపరంగా మార్పు చెందిన దోమలను నియంత్రించి, ప్రయోగాత్మకంగా విడుదల చేయడానికి అనుమతించింది. జన్యుపరంగా మార్పు చెందిన దోమల ద్వారా ఈడిస్ ఈజిప్టి దోమల జనాభాను అణచివేయవచ్చని నిరూపించేందుకు పైలట్ ప్రాజెక్ట్ ను ప్రారంభించారు.
ఈ పైలట్ ప్రాజెక్టు ద్వారా జన్యుపరమైన దోమల ద్వారా రోగకారక దోమలతో కలపడం ద్వారా కీటకాల సంతానాన్ని నియంత్రించవచ్చు. ఈ జన్యుమార్పడి దోమల్లో సంతాన్ని నిర్మూలించే జన్యువు కలిగి ఉంటాయి. బయోటెక్నాలజీ కంపెనీ Oxitec ఈ దోమల నియంత్రణ వ్యూహాన్ని రూపొందించింది. అనే పరిశోధనలను నిర్వహించగా విజయం సాధించింది. లాస్ అలమోస్ నేషనల్ లాబొరేటరీలో వ్యాధులు, పర్యావరణ వ్యవస్థలను పరిశోధించే మ్యాథమెటికల్ ఎపిడెమియాలజీలో నిపుణుడు క్యారీ మనోర్ మాట్లాడుతూ.. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నియంత్రించడానికి జన్యుమార్పిడి దోమలను సృష్టించామని తెలిపారు.
Read Also : Good Mosquitoes : ఈ దోమలు ‘మంచి’వి : డెంగ్యూని నివారిస్తాయి