India Corona Cases : దేశంలో కొత్తగా 811 కరోనా కేసులు.. ఇద్దరు మృతి
భారత్ లో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. దేశంలో వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. వరుసగా మూడో రోజూ కొత్త కేసులు వెయ్యిలోపే నమోదయ్యాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 811 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.
- bheemraj
- Published on- November 9, 2022 / 01:09 PM IST
CORONA INDIA
India Corona Cases : భారత్ లో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. దేశంలో వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. వరుసగా మూడో రోజూ కొత్త కేసులు వెయ్యిలోపే నమోదయ్యాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 811 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,62,952కి చేరింది.
ప్రస్తుతం దేశంలో 13,559 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు 4,41,18,882 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. కరోనా బారిన పడి గత 24 గంటల్లో ఇద్దరు మృతి చెందగా మొత్తం మరణాల సంఖ్య 5,30,511కి చేరింది.
COVID infection: బ్రిటన్‌లో 411 రోజుల పాటు కరోనా పాజిటివ్‌తో బాధపడ్డ వ్యక్తి.. ఎట్టకేలకు విముక్తి
మొత్తం కేసుల్లో 0.03 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. రికవరీ రేటు 98. 78శాతం, మరణాలు 1.19 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 219.75 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు పేర్కొంది.
