COVID infection: బ్రిటన్‌లో 411 రోజుల పాటు కరోనా పాజిటివ్‌తో బాధపడ్డ వ్యక్తి.. ఎట్టకేలకు విముక్తి

 బ్రిటన్‌లో 411 రోజుల పాటు కరోనాతో బాధపడ్డాడు ఓ వ్యక్తి. ఎట్టకేలకు ఆయనకు తాజాగా కరోనా నుంచి విముక్తి లభించింది. కరోనాతో అన్ని రోజులు బాధపడిన వ్యక్తి ప్రపంచంలో ఆయన తప్ప మరెవ్వరూ లేరు. 59 ఏళ్ల ఆ బ్రిటిష్ వ్యక్తికి 2020 డిసెంబరులో కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ ఏడాది జనవరి వరకు ఆయనకు ఎన్నిసార్లు పరీక్ష చేసినా పాజిటివ్ గానే వచ్చింది. అనంతరం కూడా కరోనా లక్షణాలతో బాధపడ్డాడు. ప్రస్తుతం కోలుకున్నాడు.

COVID infection: బ్రిటన్‌లో 411 రోజుల పాటు కరోనా పాజిటివ్‌తో బాధపడ్డ వ్యక్తి.. ఎట్టకేలకు విముక్తి

COVID 19

COVID infection: బ్రిటన్‌లో 411 రోజుల పాటు కరోనాతో బాధపడ్డాడు ఓ వ్యక్తి. ఎట్టకేలకు ఆయనకు తాజాగా కరోనా నుంచి విముక్తి లభించింది. కరోనాతో అన్ని రోజులు బాధపడిన వ్యక్తి ప్రపంచంలో ఆయన తప్ప మరెవ్వరూ లేరు. 59 ఏళ్ల ఆ బ్రిటిష్ వ్యక్తికి 2020 డిసెంబరులో కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ ఏడాది జనవరి వరకు ఆయనకు ఎన్నిసార్లు పరీక్ష చేసినా పాజిటివ్ గానే వచ్చింది. అనంతరం కూడా కరోనా లక్షణాలతో బాధపడ్డాడు. ప్రస్తుతం కోలుకున్నాడు.

ఆయనకు రోగనిరోధక శక్తి తక్కువగా ఉందని, ఓ కిడ్నీ మార్పిడి కూడా చేయించుకున్నాడని వైద్యులు తెలిపారు. వూహాన్ నుంచి మొదటిసారి బయటకు వచ్చిన కరోనా వేరియంట్ ఆయనకు సోకిందని జన్యు విశ్లేషణలో తేలిందని వివరించారు. బాధితుడికి లండన్ లోని సెయింట్ థామస్ ఆసుపత్రిలో చికిత్స అందింది. కరోనా తొలి వేరియంట్లను అరికట్టేందుకు ప్రభావవంతంగా పనిచేసిన పలు రకాల యాంటీబాడీలతో మొదట బాధితుడికి చికిత్స అందించినట్లు వివరించారు.

అనంతరం యాంటీవైరల్ ఔషధాలు పాక్స్లోవిడ్, రెమ్‌డెసివిర్ తో చికిత్స అందించామని వైద్యులు చెప్పారు. ఆ సమయంలో బాధితుడు అపస్మారక స్థితిలో ఉన్నాడని, నాసల్ ట్యూబ్ ద్వారా పాక్స్లోవిడ్, రెమ్‌డెసివిర్ ను అతడి శరీరంలోకి పంపామని తెలిపారు. దీంతో అతడు కోలుకుంటూ వచ్చాడని చెప్పారు. కరోనా వల్ల కొన్ని నెలల పాటు సమస్యలు ఎదుర్కొన్న వారు యూకేలో 21 లక్షల మంది ఉన్నారు.

అయితే, వారికి కొన్ని వారాల్లోనే కరోనా నెగిటివ్ గా నిర్ధారణ అయింది. కరోనా లక్షణాలు మాత్రం కొన్ని నెలల పాటు ఉన్నాయి. లండన్ లోని సెయింట్ థామస్ ఆసుపత్రిలో 411 రోజుల పాటు చికిత్స తీసుకున్న వ్యక్తికి మాత్రం అన్ని రోజుల పాటు పాజిటివ్ గానే నిర్ధారణ అవుతూ వచ్చింది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..