Driving Test Fraud: డ్రైవింగ్ టెస్ట్ మోసం.. భారత సంతతి మహిళకు బ్రిటన్‌లో జైలు శిక్ష

ఇందర్‌జిత్ కౌర్ అనే భారత సంతతి మహిళ బ్రిటన్‌లో వేరే వాళ్లకు బదులుగా డ్రైవింగ్ టెస్టులకు హాజరయ్యేది. ఒకరి తరఫునో.. ఇద్దరి తరఫునో కాదు.. ఏకంగా 150 మంది అభ్యర్థుల తరఫున డ్రైవింగ్ టెస్టుకు హాజరైంది. బ్రిటన్ మొత్తం వేరేవాళ్లకు బదులుగా ఆమె టెస్టులకు హాజరైంది.

Driving Test Fraud: ఎవరికి డ్రైవింగ్ టెస్ట్ ఉంటే వాళ్లే పరీక్షకు హాజరవ్వాలి. అలా కాకుండా ఒకరి బదులు, ఇంకొకరు టెస్ట్‌కు హాజరైతే చట్టపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. తాజాగా బ్రిటన్‌లో ఒక భారత సంతతి మహిళ ఇలా వేరేవాళ్ల బదులుగా డ్రైవింగ్ టెస్టులకు హాజరై చివరకు కటకటాల పాలవ్వాల్సి వచ్చింది.

Jharkhand: స్కూల్ నుంచి ఇంటికెళ్తున్న బాలిక కిడ్నాప్, అత్యాచారం

ఇందర్‌జిత్ కౌర్ అనే భారత సంతతి మహిళ బ్రిటన్‌లో వేరే వాళ్లకు బదులుగా డ్రైవింగ్ టెస్టులకు హాజరయ్యేది. ఒకరి తరఫునో.. ఇద్దరి తరఫునో కాదు.. ఏకంగా 150 మంది అభ్యర్థుల తరఫున డ్రైవింగ్ టెస్టుకు హాజరైంది. బ్రిటన్ మొత్తం వేరేవాళ్లకు బదులుగా ఆమె టెస్టులకు హాజరైంది. వేల్స్, బర్మింగ్‌హామ్, లండన్, కార్మర్తాన్, స్వాన్సియాతోపాటు అనేక నగరాల్లో ఇందర్‌జిత్ కౌర్ డ్రైవింగ్ టెస్టులకు హాజరైంది. థియరీ టెస్టులతోపాటు, ప్రాక్టికల్ టెస్టులు కూడా పాసై ఇతరులకు డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేలా చేసింది. ఒక్క టెస్టుకు 800 పౌండ్లు వసూలు చేసేది. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.76 వేలు. ఇంగ్లీషు మాట్లాడటం సరిగ్గా రాని వాళ్ల తరఫున ఆమె ఎక్కువగా టెస్టులకు హాజరయ్యేది.

Amnesty India: అమ్నెస్టీ ఇండియా సంస్థకు రూ.51 కోట్ల జరిమానా విధించిన ఈడీ

అయితే, విషయం బయటపడటంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. దీనిపై విచారణ జరిపిన స్థానిక కోర్టు ఇందర్‌జిత్ కౌర్‌కు ఎనిమిది నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. కాగా, తాము రోడ్డు ప్రమాదాల్ని తగ్గించేందుకు, ప్రజల భద్రతకే ప్రాధాన్యమిస్తామని అధికారులు తెలిపారు. ఇందర్‌జిత్ కౌర్‌ తన చర్య ద్వారా అర్హత లేని వారికి డ్రైవింగ్ లైసెన్సులు వచ్చేలా చేసి ఎందరో ప్రాణాల్ని ప్రమాదంలో నెట్టిందని పోలీసు అధికారులు అన్నారు.

ట్రెండింగ్ వార్తలు