Amnesty India: అమ్నెస్టీ ఇండియా సంస్థకు రూ.51 కోట్ల జరిమానా విధించిన ఈడీ

‘ద ఫారెన్ ఎక్స్‌ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా)’ నిబంధనలు ఉల్లంఘించి విదేశాల నుంచి నిధుల సేకరణ, దుర్వినియోగం వంటి చర్యలకు పాల్పడ్డందుకుగాను ఈడీ జరిమానా విధించింది. అక్రమాలకు పాల్పడ్డందుకు షోకాజ్ నోటీసు కూడా జారీ చేసింది.

Amnesty India: అమ్నెస్టీ ఇండియా సంస్థకు రూ.51 కోట్ల జరిమానా విధించిన ఈడీ

Amnesty India: అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా సంస్థతోపాటు, ఆ సంస్థ మాజీ సీఈవో ఆకర్ పటేల్‌కు భారీ జరిమానా విధించింది ‘ద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)’. అమ్నెస్టీ ఇండియా సంస్థకు రూ.51.72 కోట్లు, ఆకర్ పటేల్‌కు రూ.10 కోట్ల జరిమానా విధిస్తూ ఈడీ నిర్ణయం తీసుకుంది.

Jharkhand: స్కూల్ నుంచి ఇంటికెళ్తున్న బాలిక కిడ్నాప్, అత్యాచారం

‘ద ఫారెన్ ఎక్స్‌ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా)’ నిబంధనలు ఉల్లంఘించి విదేశాల నుంచి నిధుల సేకరణ, దుర్వినియోగం వంటి చర్యలకు పాల్పడ్డందుకుగాను ఈడీ జరిమానా విధించింది. అక్రమాలకు పాల్పడ్డందుకు షోకాజ్ నోటీసు కూడా జారీ చేసింది. ఈ జరిమానాపై అమ్నెస్టీ సంస్థ హైకోర్టును ఆశ్రయించే వీలుంది. గత ఏడాది డిసెంబరులో ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (ఎఫ్‌సీఆర్ఏ) కింద అమ్నెస్టీ సంస్థతోపాటు, అకార్ పటేల్‌పై చార్జిషీటు దాఖలైంది. దీంతో అకార్ పటేల్ విదేశాలకు వెళ్లకుండా సీబీఐ లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసింది. అమ్నెస్టీ సంస్థ ఎఫ్‌సీఆర్ఏ కింద పన్నులు ఎగ్గొట్టేందుకు ఎఫ్‌డీఐ ద్వారా బ్రిటన్‌లోని మాతృ సంస్థ నుంచి భారీగా నిధులు పొందింది.

Covid-19: ఒకే స్కూల్లో 31 మంది విద్యార్థులకు కరోనా

ఈ సంస్థ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు విస్తరించేందుకు ఈ నిధుల్ని పొందింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుమతులు లేకుండానే భారీ స్థాయిలో నిధుల్ని స్వీకరించింది. 2013-2018 వరకు అమ్నెస్టీ ఇండియా స్వీకరించిన నిధుల ఆధారంగా ఈడీ విచారణ సాగింది. కాగా, తనకు జరిమానా విధించడంపై ఆకర్ పటేల్ ట్విట్టర్‌లో స్పందించారు. తాము కోర్టులో పోరాడి గెలుస్తామని ట్వీట్ చేశారు.