Covid-19: ఒకే స్కూల్లో 31 మంది విద్యార్థులకు కరోనా

తమిళనాడులోని తేని జిల్లా, అండిపట్టి ప్రభుత్వ పాఠశాలలో ఈ పరిస్థితి తలెత్తింది. కొద్ది రోజులుగా విద్యార్థుల్లో జలుబు, జ్వరం వంటి కరోనా లక్షణాలు ఉండటంతో పాఠశాల నిర్వాహకులు జిల్లా అధికారులకు సమాచారం అందించారు.

Covid-19: ఒకే స్కూల్లో 31 మంది విద్యార్థులకు కరోనా

Covid 19

Covid-19: తమిళనాడులోని ఒక ప్రభుత్వ పాఠశాలలో 31 మంది విద్యార్థులకు కరోనా సోకింది. వీరితోపాటు మరో పది మంది కూడా కరోనా బారినపడ్డారు. ఇందులో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఉన్నారు. రెండు రోజుల్లో 31 మంది స్టూడెంట్స్ కరోనా బారిన పడటంతో స్థానికులు, పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు.

Jharkhand: స్కూల్ నుంచి ఇంటికెళ్తున్న బాలిక కిడ్నాప్, అత్యాచారం

తమిళనాడులోని తేని జిల్లా, అండిపట్టి ప్రభుత్వ పాఠశాలలో ఈ పరిస్థితి తలెత్తింది. కొద్ది రోజులుగా విద్యార్థుల్లో జలుబు, జ్వరం వంటి కరోనా లక్షణాలు ఉండటంతో పాఠశాల నిర్వాహకులు జిల్లా అధికారులకు సమాచారం అందించారు. దీంతో జిల్లా యంత్రాంగం స్పందించి పాఠశాలలో గురు, శుక్రవారాల్లో కరోనా పరీక్షలు నిర్వహించింది. ఈ రెండు రోజులపాటు జరిపిన పరీక్షల్లో 31 మంది విద్యార్థులతోపాటు, మరో 10 మందికి కరోనా సోకినట్లు తేలింది. గురువారం 12 మంది విద్యార్థులకు కరోనా సోకగా, శుక్రవారం 19 మందికి కరోనా సోకినట్లు తేలింది.

Tiger: అనకాపల్లి జిల్లాలో పులి సంచారం.. ఆందోళనలో ప్రజలు

ప్రస్తుతం పాఠశాలను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. మూడు రోజులపాటు సెలవులు ప్రకటించారు. మరోవైపు స్కూల్‌ను పూర్తిగా శానిటైజ్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాల్లో తమిళనాడు కూడా ఉంది. ఇక్కడ గురువారం ఒక్కరోజే 2,765 కరోనా కేసులు నమోదయ్యాయి. రాజధాని చెన్నైలోనే 1,011 కరోనా కేసులు నమోదయ్యాయి.