Tiger: అనకాపల్లి జిల్లాలో పులి సంచారం.. ఆందోళనలో ప్రజలు

విస్సన్నపేట శివారు రంగబోలు గెడ్డ, పడమటమ్మ లోవ ప్రాంతాల్లోనే కొంతకాలంగా పెద్ద పులి సంచరిస్తోంది. ఇటీవల ఒక దూడను పులి సగం తిని వదిలేసింది. ఆ లేగదూడ కళేబరాన్ని తినడానికి గురువారం రాత్రి మళ్లీ పులి వచ్చినట్లు తెలిసింది.

Tiger: అనకాపల్లి జిల్లాలో పులి సంచారం.. ఆందోళనలో ప్రజలు

Tiger

Tiger: అనకాపల్లి జిల్లా కసింకోట మండలం విస్సన్నపేట శివారు అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు సమాచారం. విస్సన్నపేట శివారు రంగబోలు గెడ్డ, పడమటమ్మ లోవ ప్రాంతాల్లోనే కొంతకాలంగా పెద్ద పులి సంచరిస్తోంది. ఇటీవల ఒక దూడను పులి సగం తిని వదిలేసింది. ఆ లేగదూడ కళేబరాన్ని తినడానికి గురువారం రాత్రి మళ్లీ పులి వచ్చినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడ ఏర్పాటు చేసిన సీసీ టీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ కెమెరా దృశ్యాల ఆధారంగా పులి జాడ కోసం అటవీ శాఖ అధికారులు జల్లెడపడుతున్నారు.

Jharkhand: స్కూల్ నుంచి ఇంటికెళ్తున్న బాలిక కిడ్నాప్, అత్యాచారం

మరోవైపు పులిని పట్టుకునేందుకు నిపుణుల బృందం కూడా సాయపడుతోంది. పులిని పట్టుకునేందుకు గురువారమే బోనులను తెప్పించినప్పటికీ వాటిని ఏర్పాటు చేయడానికి అవకాశం లేని పరిస్తితి నెలకొంది. దీంతో శుక్రవారం రోజు ఎలాగైనా బోనుల్ని ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అయితే, ఈ ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తుండటంతో విస్సన్నపేట గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. పశువులను కూడా మేతకు బయటకు తీసుకెళ్లలేని పరిస్థితి ఉంది. అధికారులు త్వరగా పులిని పట్టుకోవాలని ప్రజలు కోరుతున్నారు.