Shivraj Chouhan: అభివృద్ధిలో హైదరాబాద్‌ను ఇండోర్ అధిగమిస్తుంది: మధ్యప్రదేశ్ సీఎం
అభివృద్ధిలో హైదరాబాద్, బెంగళూరులను ఇండోర్ అధిగమిస్తుందని, మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ గెలుపొందితేనే ఇది సాధ్యమవుతుందని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు.
- T Venkateshwarlu
- Published On : May 30, 2022 / 12:12 PM IST
Shivraj Singh
Shivraj Chouhan: అభివృద్ధిలో హైదరాబాద్, బెంగళూరులను ఇండోర్ అధిగమిస్తుందని, మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ గెలుపొందితేనే ఇది సాధ్యమవుతుందని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. కేవలం పదేళ్లలో హైదరాబాద్, బెంగళూరులను ఇండోర్ వెనకేసేస్తుందని ఆయన చెప్పారు. బీజేపీ నేతే మేయర్‌గా ఎన్నిక కావాల్సి ఉందని అన్నారు. ఎన్నికలకు తమ పార్టీ నేతలు, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు.
2024 General elections: 2024 లోక్‌సభ ఎన్నికలే ప్రధాన అజెండాగా బెంగాల్‌కు జేపీ నడ్డా!
ఇప్పటికే గ్రామీణ ప్రాంత స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రకటన వచ్చిందని, త్వరలోనే పట్టణ ప్రాంత స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా ప్రకటన వస్తుందని ఆయన అన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాగా, మధ్యప్రదేశ్ పంచాయతీ ఎన్నికలు మూడు దశల్లో నిర్వహించనున్నారు. జూన్ 25, జులై 1, 8 తేదీల్లో ఈ ఎన్నికలు నిర్వహించి, జులై 15లోపు ఫలితాలు ప్రకటిస్తారు.
