2024 General elections: 2024 లోక్‌స‌భ ఎన్నిక‌లే ప్ర‌ధాన అజెండాగా బెంగాల్‌కు జేపీ న‌డ్డా!

దేశంలో 2024లో జ‌రిగే లోక్‌స‌భ‌ ఎన్నిక‌ల కోసం బీజేపీ అప్పుడే ప్ర‌ణాళిక‌లు వేసుకుంటోంది. ఆ ఎన్నిక‌లే ప్ర‌ధాన అజెండాగా ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా జూన్ మొద‌టి వారంలో ప‌శ్చిమ బెంగాల్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు.

2024 General elections: 2024 లోక్‌స‌భ ఎన్నిక‌లే ప్ర‌ధాన అజెండాగా బెంగాల్‌కు జేపీ న‌డ్డా!

Jp Nadda

2024 General elections: దేశంలో 2024లో జ‌రిగే లోక్‌స‌భ‌ ఎన్నిక‌ల కోసం బీజేపీ అప్పుడే ప్ర‌ణాళిక‌లు వేసుకుంటోంది. ఆ ఎన్నిక‌లే ప్ర‌ధాన అజెండాగా ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా జూన్ మొద‌టి వారంలో ప‌శ్చిమ బెంగాల్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల వ్యూహాల గురించి త‌మ పార్టీ నేత‌ల‌తో స‌మావేశమై వ్యూహాల‌ను వివ‌రించ‌నున్నారు.

Bermuda Triangle: బెర్ముడా ట్రయాంగిల్ అంటే ప‌ర్యాట‌కుల‌కు ఎందుకు అంత భ‌యం?

బీజేపీ అగ్ర‌నేత‌లు ప‌ర్య‌టిస్తుండ‌డంతో రాష్ట్రంలోని త‌మ పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల్లో మ‌రింత ఉత్సాహం నిండుతుంద‌ని ఈ సంద‌ర్భంగా బీజేపీ ప‌శ్చిమ బెంగాల్ ఉపాధ్య‌క్షుడు సౌమిత్రా ఖాన్ అన్నారు. ప‌శ్చిమ బెంగాల్‌లో మ‌మ‌తా బెన‌ర్జీ ప్ర‌భుత్వాన్ని గ‌ద్దె దింపేందుకు ప్ర‌జ‌లు సిద్ధంగా ఉన్నార‌ని ఆయ‌న చెప్పారు. జూన్ 7 లేదా 8న జేపీ న‌డ్డా త‌మ రాష్ట్రంలో ప‌ర్య‌టించి, 2024 ఎన్నిక‌ల వ్యూహాల‌ను వివ‌రిస్తార‌ని ఆయ‌న అన్నారు.

Bermuda Triangle: విచిత్ర ఆఫ‌ర్.. నౌక అదృశ్య‌మైతే అందులోని ప్ర‌యాణికుల‌కు 100 శాతం రిఫండ్

కాగా, ఇప్ప‌టికే ప‌శ్చిమ బెంగాల్‌లో ఈ నెల‌లో కేంద్ర మంత్రి అమిత్ షా రెండు రోజుల పర్యటనలో పాల్గొన్నారు. బీజేపీ అగ్ర‌నేత‌లు వ‌రుస‌గా ప‌శ్చిమ బెంగాల్‌లో ప‌ర్య‌టిస్తూ ఆ రాష్ట్రంలో త‌మ పార్టీని మ‌రింత‌ బ‌లోపేతం చేయడానికి ప్ర‌య‌త్నిస్తున్నారు. ప‌శ్చిమ బెంగాల్‌లో మొత్తం 42 లోక్‌స‌భ సీట్లు ఉండ‌గా, 2019 ఎన్నిక‌ల్లో బీజేపీ 18, తృణ‌మూల్ కాంగ్రెస్ 22 సీట్లు గెలుచుకున్నాయి.