Bermuda Triangle: విచిత్ర ఆఫ‌ర్.. నౌక అదృశ్య‌మైతే అందులోని ప్ర‌యాణికుల‌కు 100 శాతం రిఫండ్

బెర్ముడా ట్రయాంగిల్‌కు వెళ్లే ప్ర‌యాణికులు మాయ‌మైపోతారని భ‌య‌ప‌డాల్సిన అవస‌రం లేద‌ని అమెరికాకు చెందిన ట్రావెల్ ఏజెన్సీ 'ఎన్షియంట్ మిస్ట‌రీస్ క్రూయిజ్' అంటోంది.

Bermuda Triangle: విచిత్ర ఆఫ‌ర్.. నౌక అదృశ్య‌మైతే అందులోని ప్ర‌యాణికుల‌కు 100 శాతం రిఫండ్

Bermuda

Bermuda Triangle: బెర్ముడా ట్రయాంగిల్‌కు వెళ్లే ప్ర‌యాణికులు మాయ‌మైపోతారని భ‌య‌ప‌డాల్సిన అవస‌రం లేద‌ని అమెరికాకు చెందిన ట్రావెల్ ఏజెన్సీ ‘ఎన్షియంట్ మిస్ట‌రీస్ క్రూయిజ్’ అంటోంది. అక్క‌డ‌కు వెళ్లే ప్ర‌యాణికులు అదృశ్యం కాకుండా ఆ సంస్థ ర‌క్ష‌ణ క‌ల్పిస్తుందేమోన‌ని మీరు అనుకుంటే పప్పులో కాలు వేసిన‌ట్లే. బెర్ముడా ట్రయాంగిల్‌కు వెళ్లిన త‌మ నౌక ఒక‌వేళ మాయ‌మైపోతే ప్ర‌యాణికుల‌కు 100 శాతం రిఫండ్ అందిస్తామ‌ని తెలిపింది. దీంతో భ‌య‌ప‌డ‌కుండా ప‌ర్య‌ట‌న కొన‌సాగించ‌వ‌చ్చ‌ని పేర్కొంది.

Jignesh Mevani: నేను ముఖ్య‌మంత్రి ప‌ద‌వి రేసులో లేను: జిగ్నేశ్ మేవానీ

ఈ విచిత్ర‌మైన ఆఫ‌ర్ ప్ర‌క‌టించ‌డంతో ఆ సంస్థకు ఇప్పుడు భారీగా ప‌బ్లిసిటీ వ‌చ్చేస్తోంది. ఇటువంటి ఆఫర్ ప్రకటించిన ఆ సంస్థపై విమర్శలు కూడా వస్తున్నాయి. ప‌ర్యాట‌కుల‌తో బెర్ముడా ట్రయాంగిల్‌కు వెళ్లిన‌ నౌక‌లు, విమానాలు వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు, మాన‌వ త‌ప్పిదాల కార‌ణంగా క‌న‌ప‌డ‌కుండాపోయిన ఘ‌ట‌న‌లు ఎన్నో ఉన్నాయి. ఈ నేప‌థ్యంలోనే మిస్ట‌రీస్ క్రూయిజ్ సంస్థ ఈ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. ‘‘బర్ముడా ట్ర‌యాంగిల్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్తే క‌నిపించ‌కుండాపోతామ‌న్న ఆందోళ‌న‌ అవ‌స‌రం లేదు. మేము 100 శాతం రిఫండ్ ఆఫ‌ర్ ప్ర‌క‌టిస్తున్నాము’’ అంటూ ఆ సంస్థ త‌మ అధికారిక వెబ్‌సైట్‌లో ప్ర‌క‌ట‌న చేయ‌డం గ‌మ‌నార్హం.

UN human rights: ఐరాస మానవ హ‌క్కుల బృందం చైనాలో స్వేచ్ఛ‌గా ప‌ర్య‌టించలేదు: అమెరికా

న్యూయార్క్ నుంచి బెర్ముడాకు వ‌చ్చే ఏడాది మార్చి 28 నుంచి అట్లాంటిక్ స‌ముద్రం మీదుగా ప్ర‌యాణం చేయ‌డానికి ప్ర‌యాణికులు టికెట్ బుకింగులు చేసుకోవ‌చ్చ‌ని తెలిపింది. రెండు రోజుల పాటు కొన‌సాగే ఈ ప్ర‌యాణం కోసం దాదాపు రూ.1.20 ల‌క్ష‌లు చెల్లించిన వారికి నౌక‌లో క్యాబిన్లు కేటాయిస్తారు. నౌక కనపడకుండాపోతే ప‌ర్య‌ట‌న కోసం ప్ర‌యాణికులు చెల్లించే డ‌బ్బు మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామ‌ని ‘మిస్ట‌రీస్ క్రూయిజ్’ ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ, ఆ డ‌బ్బును ఎవ‌రికి చెల్లిస్తారు? అనే ప్ర‌శ్న త‌లెత్తుతోంది. మిగ‌తా వివ‌రాలు ఆ సంస్థ తెల‌ప‌లేదు.