Bermuda Triangle: బెర్ముడా ట్రయాంగిల్ అంటే ప‌ర్యాట‌కుల‌కు ఎందుకు అంత భ‌యం?

మానవ మేధస్సును స‌వాలు చేస్తోన్న ర‌హ‌స్యాలు ఈ ప్ర‌పంచంలో ఎన్నో ఉన్నాయి. మాన‌వులు ఇప్ప‌టివ‌ర‌కు ఎన్నో ర‌హ‌స్యాల‌ను ఛేదించిన‌ప్ప‌టికీ, ఇప్ప‌టికీ మ‌నిషి మేధ‌స్సుకి అంతుచిక్క‌ని అంశాలు ఎన్నో ఉన్నాయి.

Bermuda Triangle: బెర్ముడా ట్రయాంగిల్ అంటే ప‌ర్యాట‌కుల‌కు ఎందుకు అంత భ‌యం?

Traiangle Bermuda

Bermuda Triangle: మానవ మేధస్సును స‌వాలు చేస్తోన్న ర‌హ‌స్యాలు ఈ ప్ర‌పంచంలో ఎన్నో ఉన్నాయి. మాన‌వులు ఇప్ప‌టివ‌ర‌కు ఎన్నో ర‌హ‌స్యాల‌ను ఛేదించిన‌ప్ప‌టికీ, ఇప్ప‌టికీ మ‌నిషి మేధ‌స్సుకి అంతుచిక్క‌ని అంశాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి ర‌హ‌స్య ప్రాంత‌మే బెర్ముడా ట్రయాంగిల్. ప్ర‌పంచంలో ఉన్న అత్యంత ప్ర‌మాద‌క‌ర ప్రాంతాల్లో ఇది ఒక‌టి. అట్లాంటిక్ మ‌హా స‌ముద్రం వాయ‌వ్య దిశ‌లో దాదాపు 7 ల‌క్ష‌ల చ‌ద‌ర‌పు కిలోమీట‌ర్లు విస‌ర్తించి ఉంటుంది.

Bermuda Triangle: విచిత్ర ఆఫ‌ర్.. నౌక అదృశ్య‌మైతే అందులోని ప్ర‌యాణికుల‌కు 100 శాతం రిఫండ్

బెర్ముడా ట్రయాంగిల్‌కు వెళ్లిన ఎన్నో విమానాలు, నౌక‌లు ఆచూకీ తెలియ‌కుండా పోయాయి. అట్లాంటిక్ స‌ముద్ర రాకాసి అల‌లు ఎగిసిప‌డుతూ ఆ ప్రాంతం భీక‌రంగా క‌న‌ప‌డుతుంది. ఈ నేప‌థ్యంలోనే దీన్ని అత్యంత ప్ర‌మాద‌క‌ర ప్రాంతంగా ప‌రిగ‌ణిస్తారు. అందుకే ప‌ర్యాట‌కుల‌కు బెర్ముడా ట్రయాంగిల్‌కు అంటే అంత భ‌యం. బెర్ముడా ట్రయాంగిల్‌ను డెవిల్ ట్ర‌యాంగిల్‌గానూ పిలుస్తారు.

Bermuda Triangle: బెర్ముడా ట్రయాంగిల్‌లో గ్ర‌హాంత‌ర వాసులు ఉన్నారా?

శాస్త్ర‌వేత్త‌ల‌కు అంతుచిక్క‌ని బెర్ముడా ట్రయాంగిల్ ర‌హ‌స్య కథే ఆధారంగా 1978లో ఓ ఇంగ్లిష్ సినిమా కూడా వ‌చ్చింది. ది బెర్ముడా ట్రయాంగిల్ పేరిట ఈ సినిమాను ద‌ర్శ‌కుడు రెనె కార్డోనా రూపొందించారు. ఓ ఓడ‌లో బెర్ముడా ట్రయాంగిల్‌కు వెళ్లిన కొందరికి, స‌ముద్రంలో బొమ్మ దొరుకుతుంది. ఆ బొమ్మ‌ను డ‌యానా అనే బాలిక తీసుకుంటుంది. అనంత‌రం ఓడ‌లోని వారంతా చ‌నిపోతార‌ని ఆమె చెబుతుంది. చివ‌ర‌కు, ఆమె చెప్పిన‌ట్లే జ‌రుగుతుంది.