Telangana Assembly Elections 2023 : తెలంగాణ సరిహద్దు అసెంబ్లీ సెగ్మెంట్లలో పొరుగు రాష్ట్రాల ప్రభావం…పొరుగు నేతల ప్రచారం

ప్రస్థుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తెలంగాణలో సరిహద్దుల్లోని 30కిపైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో పొరుగు రాష్ట్రాల ప్రభావం పడింది. తెలంగాణ సరిహద్దుల్లో కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. దీంతో తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పొరుగు రాష్ట్రాల నేతలు రంగంలోకి దిగారు.....

EVM

Telangana Assembly Elections 2023 : ప్రస్థుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తెలంగాణలో సరిహద్దుల్లోని 30కిపైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో పొరుగు రాష్ట్రాల ప్రభావం పడింది. తెలంగాణ సరిహద్దుల్లో కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. దీంతో తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పొరుగు రాష్ట్రాల నేతలు రంగంలోకి దిగారు. రాష్ట్ర సరిహద్దుల్లోని సంగారెడ్డి, నారాయణఖేడ్, కొడంగల్,గద్వాల, దేవరకద్ర, తాండూర్, పరిగి, వికారాబాద్, జహీరాబాద్ ప్రాంతాల్లో కర్ణాటక రాష్ట్రానికి చెందిన బలమైన సామాజిక వర్గమైన లింగాయత్ లు అధికంగా ఉన్నారు.

కాంగ్రెస్ ఎన్నికల ఇన్ చార్జులుగా కర్ణాటక మంత్రులు

సరిహద్దు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్లు తెలుగుతోపాటు కన్నడ భాష మాట్లాడుతారు. దీంతో ఈ సారి పొరుగున ఉన్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో దిగారు. కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ లు తెలంగాణలో సుడిగాలి పర్యటనలు చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థులకు ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. దీంతోపాటు 10 మంది కర్ణాటక రాష్ట్ర మంత్రులు తెలంగాణ అసెంబ్లీ కాంగ్రెస్ ఎన్నికల ఇన్ చార్జులుగా సైతం పనిచేస్తున్నారు.

కర్ణాటక కాంగ్రెస్ నేతల ముమ్మర ప్రచారం

కాంగ్రెస్ విజయానికి కర్ణాటక కాంగ్రెస్ నేతలు చెమటోడ్చి పనిచేయడమే కాకుండా ఎన్నికల కోసం నిధులు కూడా సమకూర్చారని రాజకీయ పరిశీలకులు చెబతున్నారు. కర్ణాటక నేతలు తెలంగాణలో మకాం వేసి కాంగ్రెస్ పక్షాన ముమ్మర ప్రచారం చేస్తున్నారు. మరో వైపు బీఆర్ఎస్ అభ్యర్థులు సైతం కర్ణాటకలోని వ్యాపార ప్రముఖుల నుంచి మద్ధతు కూడగట్టే యత్నం చేస్తున్నారు. ఇప్పటికే కర్ణాటకలోని జేడీ(ఎస్) పార్టీ అధినేత కుమారస్వామితోపాటు ఆ పార్టీ నేతలు బీఆర్ఎస్ కు మద్ధతు ఇస్తున్నారు.

కాంగ్రెస్ కు ఊపు తెచ్చిన కర్ణాటక ఫలితం

పొరుగున ఉన్న కర్ణాటకలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఊపు తెచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దులున్న తెలంగాణలోని ఖమ్మం, నల్గొండ, నాగర్ కర్నూలు, వనపర్తి, జోగులాంబగద్వాల జిల్లాల్లోని పలు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. గతంలో జరిగిన ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ పార్టీకి ఏపీలోని వైసీపీ నేతలు అన్నిరకాలుగా సహాయ సహకారాలు అందించారు.

సెటిలర్ల ఓట్ల కోసం…

దీంతోపాటు ఆంధ్రాకు చెందిన ఓటర్లు తెలంగాణలో సెటిల్ అయ్యారు. దీంతో కమ్మ, కాపు వర్గాల వారీగా సెటిలర్ల ఓట్ల కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతలు యత్నిస్తున్నారు. ఇటీవల అరెస్ట్ అయిన చంద్రబాబుకు మద్ధతుగా అరెస్టును ఖండిస్తూ ప్రకటనలు చేస్తూ కమ్మ కులం సెటిలర్ల ఓట్లు పొందేందుకు ప్రధాన రాజకీయ పార్టీల నేతలు యత్నిస్తున్నారు.

ALSO READ : Telangana Assembly Elections 2023 : వలస ఓటర్లపై రాజకీయ పార్టీల దృష్టి…ఇతర రాష్ట్రాల నుంచి పోలింగుకు తీసుకువచ్చేందుకు అభ్యర్థుల యత్నాలు

మరో వైపు జనసేన అధినేత, ప్రముఖ సినీనటుడు పవన్ కల్యాణ్ తో ఎన్నికల పొత్తు పెట్టుకున్న బీజేపీ కాపు సెటిలర్ల ఓట్లు పొందేందుకు యత్నిస్తోంది. మహారాష్ట్ర సరిహద్దుల్లో ఆదిలాబాద్ పూర్వ జిల్లాలోని ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాలున్నాయి. మహారాష్ట్ర సరిహద్దుల్లోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహారాష్ట్ర ప్రభావం ఉంటుంది.

ALSO READ : Railways Good News : దేశంలో రైల్వే ప్రయాణికులకు శుభవార్త

మహారాష్ట్రకు చెందిన మాణిక్ రావు ఠాక్రే కాంగ్రెస్ అభ్యర్థుల పక్షాన ప్రచారం చేస్తున్నారు. దీంతో మహారాష్ట్రలో ఉన్న ప్రాబల్యంతో బీజేపీ ఓట్లు పొందాలని యత్నిస్తోంది. మరో వైపు ఛత్తీస్ ఘడ్ సరిహద్దుల్లో ఉన్న మూడు అసెంబ్లీ నియోజవర్గాల్లో ఆదివాసీ ఓటర్ల మద్ధతు కోసం అన్ని పార్టీల అభ్యర్థులు యత్నిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు