Amazing jewelry : వజ్రాలను మించి..ఫ్యాషన్‌ ప్రపంచాన్ని ఏలుతున్న ఆభరణాలు

నగలంటే బంగారంతో చేసినవే కాదు. వజ్రాల నగల్ని మించి ధగధగలాడిపోతు ఫ్యాషన్‌ ప్రపంచాన్ని ఏలుతున్నా ఈ నయా ఆభరణాలు..అందం..ధృఢత్వం కలిగిన ఈ నగలు ఇప్పుడు ట్రెండ్ గా మారాయి.

Zirconium Jewelry

Zirconium jewelry : నగలు అంటే ఒకప్పుడు బంగారంతో చేయించుకునేవారు. శ్రీమంతులైతే వజ్రాలు, ప్లాటినంతో చేయించుకుంటారు. కళ్లు జిగేల్‌మనిపించే నగలు వేసుకుని నలుగురిలో మెరిసిపోవాలని ప్రతి
ఒక్కరూ ఆశపడతారు. కానీ బంగారం,వజ్రాల నగలు అందరు వేసుకోలేరు కదా? అటువంటివారినే దృష్టిలో పెట్టుకుని డిజైనర్లు మార్కెట్ లోకి ఇమిటేషన్ జ్యుయలరీ తీసుకొచ్చారు. బంగారంతో చేసిన నగల్లో కూడా లేని డిజైన్లతో ఇమిటేషన్ నగలు మార్కెట్ లో కోకొల్లలుగా హల్ చల్ చేస్తున్నాయి. మ్యాచింగ్ నగలకు కొదువేలేదు. బంగారం నగలు..ఇమిటేషన్ నగలు పక్క పక్కన పెట్టి చూస్తే ఏవి ఒరిజినలో కూడా తెలియకుండా ఉన్నాయి. వీటిలో స్టోన్ జ్యుయలరీలకు ఏమాత్రం తక్కువలేదు.

మారుతున్న ఫ్యాషన్ ప్రపంచానికి తగినట్లుగా జ్యుయలరీల్లో కూడా పెను మార్పులు వస్తున్నాయి. కొత్త కొత్త మెటీరియల్ తో నగలు మగువల మనసుల్ని దోచుకుంటున్నాయి. అటువంటివే ‘‘జిర్కోనియం జ్యువెలరీ’’. వజ్రాల నగలకు ఏమాత్రం తీసిపోని మెరుపులు ఈ జిర్కోనియం నగల సొంతం అని చెప్పటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ధగధగలతో ఖరీదైన వర్జాల నగలను కూడా మరిపించి మగువల మనసుల్ని దోచేస్తున్నాయి ఈ ‘‘జిర్కోనియం జ్యువెలరీ’’..!!

ఇదికూడా చదవండి : Reliance Jewels : రిలయన్స్ జ్యువెల్స్.. డైమండ్ నెక్లెస్ సెట్స్ రిలీజ్

ట్రెండ్ అండ్ డ్రెడిషయన్ నగలకు జిర్కోనియం
మేళవించిన జిర్కోనియం ఆభరణాలు ధరించేందుకు మోజుపడుతున్నారు ఈ తరం అతివలు. మిగతా లోహాలతో పోలిస్తే జిర్కోనియానికి దృఢత్వం ఎక్కువ. అందుకే దీన్ని కృత్రిమ దంతాలు, కృత్రిమ ఎముకల తయారీలో వాడుతారు. దీని మెరుపు, దృఢత్వం వల్ల ప్రస్తుతం నగల తయారీల్లో కూడా జిర్కోనియం హల్ చల్ చేస్తోంది. ఎన్నో రకాల డిజైన్లతో జిర్కోనియం నగలు ఆకట్టుకుంటున్నాయి.

జిర్కోనియం, టైటానియం ఖనిజాలను సోదర ధాతువులుగా పరిగణిస్తారు. వీటి మిశ్రమంతో తయారుచేసిన నగలు దృఢంగా ఉంటాయి. కిందపడ్డా ఏమాత్రం డ్యామేజ్ కావు. ఈ జిర్కోనియం ముడిపదార్థం ఏ రంగునూ కలిగి ఉండదు. కానీ దీన్ని వివిధ లోహాలతో వివిధ ప్రక్రియల్లో రసాయనిక చర్య జరపడం వల్ల నలుపు, తెలుపు, నీలం, ఊదారంగువంటి వర్ణాల్లోకి మారుతుంది. దీంతో తక్కువ ధరలోనే వినూత్నమైన డిజైన్ల జిర్కోనియం నగలు అందుబాటులోకి వస్తున్నాయి. జాతిరత్నాలకు తీసిపోని రాళ్లను పొదిగిన రంగురంగుల జిర్కోనియం నగలు ఇప్పుడు ఫ్యాషన్‌ ప్రపంచంలో ట్రెండ్‌ సృష్టిస్తున్నాయి. ఎక్కువగా వీటికి రోజ్‌గోల్డ్‌, వజ్రాలు జతచేసి పెండ్లి, నిశ్చితార్థం రింగుల్ని కూడా తయారు చేస్తున్నారు డిజైనర్లు.

ఇదికూడా చదవండి : Breast Milk Jewellery: తల్లిపాలతో తయారు చేసిన నగలు..!..బిడ్డకు పాలు ఇచ్చే మధురానుభూతులు పదిలం..!!

సాధారణంగా ఆభరణాల్లో నలుపు రంగువి ఉండవు. వివాహం అయిన స్త్రీలు నల్లపూసలనే ధరిస్తారు. అంతేతప్ప నల్లటి ఆభరణాలు ఉండవు. కానీ అయిదోతనానికి గుర్తుగా మంగళసూత్రంలోనూ నల్లపూసలు జతచేస్తారు. ఈ జిర్కోనియం నగల్లో నలుపు రంగు ఆభరణాలు కూడా ఉండటం విశేషం. దిష్టి తగలకుండా ఒంటిమీద ఏదో ఒక నలుపు ఆభరణాన్ని ధరింనటానికి ఈ జిర్కోనియం నగలు భలే ఉంటాయి. అందుకే జిర్కోనియంతోనూ నలుపు రంగు ఆభరణాలు తయారుచేస్తున్నారు. రింగులు, గాజులు, బ్రేస్‌లెట్లు, వాచ్‌బెల్టులు, గొలుసులు ఇలా ఒకటి రెండు కాదు అలంకరించుకునే అన్ని ఆభరణాలూ సిద్ధం చేస్తున్నారు జిర్కోనియంతో డిజైనర్లు.

వెండికి బదులుగా జిర్కోనియం వినియోగం..
ఆభరణాల తయారీలో వెండికి బదులుగా జిర్కోనియాన్ని ఎక్కువగా వాడుతుంటారు. దీంతో తయారు చేసిన ఆభరణం ఎంత చిన్నదైనా చక్కటి మెరుపు కలిగి ఉండటంతో దాన్ని ధరించినవారు తళుక్కుమంటారు. ఈనగలు ఎంత దృఢంగా ఉంటాయో అంత తేలికగా ఉంటాయి. బరువనిపించవు. కాబట్టి ఎన్ని నగలు వేసుకున్నా..ఎంత పెద్ద నగ ధరించినా ఇబ్బందిగా అనిపించదు. అలాగే సంప్రదాయ దుస్తులపై ధరించేందుకు వీలుగా పెద్దపెద్ద చోకర్లు, హారాలతోపాటు వెస్ట్రన్‌వేర్‌పై నప్పేలా సన్నటి, చిన్నచిన్న నగలూ అందుబాటులో ఉన్నాయి. పైనుంచి కిందివరకు ఒకే థీమ్‌తో అలంకరించుకునేలా కాంబో ఆఫర్లు కూడా ఈ జిర్కోనియం నగలు ఆకట్టుకుంటున్నాయి.

Cremation Ashes Jewellery: అస్థికలతో తయారు చేసిన నగలకు ఫుల్ డిమాండ్