Breast Milk Jewellery: తల్లిపాలతో తయారు చేసిన నగలు..!..బిడ్డకు పాలు ఇచ్చే మధురానుభూతులు పదిలం..!!

తల్లిపాలతో తయారు చేసిన నగలు..!..బిడ్డకు పాలు ఇచ్చే ఆ మధురానుభూతులు జీవితాంతం ఆ తల్లికి పదిలంగా గుర్తుపోవడటానికి తల్లిపాలతో తయారు చేసిన నగలు చక్కటి గుర్తులని చెప్పాల్సిందే.

Breast Milk Jewellery: తల్లిపాలతో తయారు చేసిన నగలు..!..బిడ్డకు పాలు ఇచ్చే మధురానుభూతులు పదిలం..!!

Breast Milk Jewellery

Updated On : December 29, 2021 / 6:40 PM IST

Jewellery Made From Breast Milk: ఇప్పటి వరకు బంగారం, వెండి, ప్లాటినంతో తయారు చేసిన నగలు గురించి అందరికి తెలుసు. ఆఖరికి అస్థికలతో (మనిషి అవశేషాలు) తయారు చేసిన నగల గురించి కూడా తెలిసే ఉంటుంది. కానీ ‘తల్లి పాలతో తయారుచేసిన నగలు’ గురించి బహుశా చాలామంది విని ఉండకపోవచ్చు. కానీ తల్లిపాలతో కూడా నగలు తయారు చేస్తున్నారు. పాలు ద్రవ పదార్ధంలో ఉంటాయి. మరి వాటితో నగలు ఎలా తయారు చేస్తారు? అనే పెద్ద డౌట్ రానే వస్తుంది. కానీ ఈ కాలంలో అదో పెద్ద విషయం కాదు. దానికి నిదర్శనమే ఈ ‘తల్లిపాలతో తయారు చేసే నగలు’..!! మరి ఆ మధురానుభూతుల అమ్మపాల నగల గురించి తెలుసుకోవాల్సిందేననిపిస్తోంది కదూ..మరి ఎందుకు లేట్..కమ్..

Read more : Reliance Jewels : రిలయన్స్ జ్యువెల్స్.. డైమండ్ నెక్లెస్ సెట్స్ రిలీజ్

యూఎస్‌కి చెందిన అల్మా పార్టిడా తన కూతురు అలెస్సాకు 18 నెలల పాటు పాలిచ్చింది.బిడ్డకు పాలు ఇచ్చే ఆ మధురానుభూతి జీవితంలో ఏ తల్లి మర్చిపోలేదు. తన రక్తాన్ని అమృత ధారగా మార్చి బిడ్డ కడుపు నింపే ఆ మధుర క్షణాలు ప్రతీ తల్లి జీవితంలోనే అపురూపమైనవే..అత్యద్భుతమైనవే. అటువంటి మధుర జ్ఞాపకాలు అనుభూతిగానే కాకుండా..ఓ వస్తువు రూపంలో కళ్లముందే కనిపిస్తే ఇంకెంత గొప్పగా..మధురంగా..అద్భుతంగా ఉంటుందో కదా..ఆ ఆలోచనే గొప్పది..ఇక తల్లిపాలు జ్ఞాపంగా ఓ రూపంగా కళ్లకు కనిపిస్తే.. ఇంకె అద్భుతంగా ఉంటుందో కదా..!! ఆ ఊహే అత్యద్భుతం..!! కీప్‌సేక్స్ బై గ్రేస్ అనే కంపెనీ అటువంటి మధురానుభూతుల్ని తల్లులకు అందిస్తోంది..!!

అల్మా పార్టిడా తాను తన పిల్లలకు ఇస్తున్న పాలను మాృతృత్వపు మాధుర్యానికి గుర్తుగా ఉంచుకునేది ఏమైనా ఉంటే బాగుండు అనుకుంది. ఆ ఆలోచన వచ్చిన వెంటనే ఇంటర్ నెట్ లో వెతికింది. ఫేస్‌ బుక్‌ తో పాటు పలు సోషల్‌ మీడియా మాధ్యమాల్లో సర్చ్‌ చేసింది. అప్పుడే ఆమెకు తల్లిపాలతో తయారు చేసే నగల కంపెనీ కీప్‌సేక్స్ బై గ్రేస్ గురించి తెలిసింది..అంతే పార్టిడా ఆనందం అంతా ఇంతా కాదు..తన ఆలోచన తన కళ్లముందే కదలాడినట్లుగా ఫీల్ అయ్యింది. ఆ ఫీలింగే ఇంత గొప్పగా ఉంటే తాను అనుకున్నది కళ్లముందు కనిపిస్తే ఇంకెత బాగుంటుందో అని ఒకటే సంబరపడిపోయింది చిన్నపిల్లలాగా..

Read more : Cremation Ashes Jewellery: అస్థికలతో తయారు చేసిన నగలకు ఫుల్ డిమాండ్

అనుకున్నదే తడవుగా పార్టడా..తన తల్లిపాలలో దాదాపు 10 మిల్లీలీటర్లను కీప్‌సేక్స్ బై గ్రేస్ అనే కంపెనీకి పంపింది. ఆ తరువాత ఒక నెలకు ఆ కంపెనీ ఆమె చేతికి ‘‘మిల్కీ-వైట్ గుండె ఆకారం’’లో ఉన్న ఓ లాకెట్టును పంపించింది. దీంతో అల్మా పార్టిడా తన కోరిక ఫలించినందకు సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బు అయిపోయింది. తాను తల్లిగా మారిన తర్వాత చివరి మిల్క్‌ డ్రాప్‌గా తన బిడ్డకు పాలు ఇస్తు సాగిన జీవితపు తీపి గుర్తుగా పదిలంగా ఉంటుందని చెప్పుకొచ్చింది.

తల్లిపాలతో తయారు చేసే నగల గురించి..కీప్‌సేక్స్ బై గ్రేస్ కంపెనీ యజమాని సారా కాస్టిల్లో మాట్లాడుతూ…తల్లిపాలతో ఆభరణాలా అంటూ ఆశ్యర్యంతోపాటు నన్ను ఒక వెర్రిదాని వలే చూశారని..నేను తయారు చేసిన ఆభరణాలను చూసిన తర్వాత తనను ఎంతోమంది అభినందించారని..ఇంత గొప్ప ఆలోచన ఎలా వచ్చిందని అడుగుతుంటారని తెలిపారు. దీంతోనాకు చాలా ఆర్డర్‌లు వస్తునే ఉన్నాయని తెలిపారు. బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు తల్లి ఎంతో నరకయాతనను అనుభవించిన తల్లుల నుంచే తనకు ఎక్కు ఆర్డర్‌లు వచ్చాయి” అని తెలిపారు ఆమె. అంతేకాదు సారా తల్లిపాలతో తయారు చేసే స్టోన్‌లు దాదాపు రూ.4 వేల నుంచి 11 వేలు వరకు ధర పలుకుతాయి.

See here  : https://10tv.in/web-stories/breast-milk-jewellery